భగవంత్ కేసరి మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ప్రోమోతో అలరించారు. ఈరోజు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , శ్రీలీల గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా సందడి చేశారు.
గణేష్ పాట కోసం ఎస్ఎస్ థమన్ పెప్పీ, మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం మాస్‌ని కట్టిపడేసింది. కరేముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను హై-పిచ్డ్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా అలపించారు.
బాలకృష్ణ, శ్రీలీల తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్ లు, గెటప్ లు , డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించాయి. విజువల్స్ అద్భుతంగా వున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. పోస్టర్లు, ప్రోమోలు సెట్ చేసిన అంచనాలను ఈ పాట అందుకుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ మ్యూజికల్ జర్నీని చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభించింది. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.