Advertisement
Google Ads BL

బాబుకు అందిన ముడుపులపై నాని ఫైర్


చంద్రబాబు పోలవరాన్ని నేనే కడతా.. నావల్లే అది జరుగుతుంది అంటూ మాట్లాడి..  తెర వెనుక.. ఆ ప్రాజెక్ట్ ని ఏటీఎం మాదిరి వాడుకుంటూ కమీషన్లు మింగుతున్నారు అని మోడీ ఆంధ్రప్రదేశ్‌లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. అన్ని నేనే చేశా.. చెయ్యగలను అంటూ మాట్లాడి మభ్యపెట్టే  చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికారు.. అంటూ పేర్ని నాని తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని ఏకి పారేసారు.  చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అంటూ ప్రముఖ వార్త పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.. ఇప్పడు చంద్రబాబు ఆ పత్రికపై  పరువు నష్టం కేసు వేస్తారా.. తన అవినీతి భాగోతం బయటపెట్టిన వారిపై కేసు వేస్తాడా.. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి అంటూ పేర్ని నాని ఆ ప్రెస్ మీట్ లో నిప్పులు చెరిగారు. 

Advertisement
CJ Advs

చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయంలో చేసింది ఒక్కటే. తనకు నచ్చిన వాళ్లకు.. అనుయాయులకు భారీగా రేట్లు పెంచి కాంట్రాక్టులు, పనులు ఇవ్వడం.. దానికి ప్రతిఫలంగా వారినుంచి వందలు.. వేల కోట్లలో కమీషన్లు నొక్కడం.. ఇదే అయన టెక్నిక్.. గతంలో అధికారంలో ఉన్నపుడు కూడా ఇలాగే జరిగింది. అమరావతి కాంట్రాక్టర్‌లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్పిసిఎల్), ఎల్&టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టాయి. ఈ విషయాలు ఐటి సంస్థల సోదాల్లో గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ చంద్రబాబుకు డబ్బు ముట్టజెప్పినట్లు షాపూర్జి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఐటి శాఖ  గుర్తించింది. . అంటూ సదరు పత్రిక రాసుకొచ్చింది.

అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టుల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవమని చెప్పారు. దాంతో మనోజ్.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ను కలిశారు. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసింది. అందులో తన కమీషన్లు వసూలు చేసేందుకు బాబు.. శ్రీనివాస్ ను రంగంలోకి దింపారు. వినయ్ నంగల్లా, విక్కీ జైన్ అనే ఇద్దరిని మనోజ్క శ్రీనివాస్ అటాచ్ చేశారు. వీరిలో వినయ్ నంగల్లా మూడు కంపెనీలు, విక్కీ జైన్ రెండు కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ల నుంచి తాము డబ్బులు తీసుకుంటామని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మనోజ్తో చెప్పారు.. అంటూ ఘాటుగా ఆ పత్రిక ఆరోపణలు చేసింది.  

బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటి అధికారులు ఆధారాలు సేకరించారు. ఇదంతా మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. ఈ విషయాన్ని మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఐటి అధికారుల ముందు కూడా అంగీకరించారు. దీంతో ఈ విషయంలో చంద్రబాబుకు సైతం ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను ఐటి శాఖ నోటీసుల్లో ప్రస్తావించింది... ఈ కేసు నుండి బయటపడేందుకు చంద్రబాబు బిజెపి నేతల చుట్టూ తిరుగుతున్నారంటూ సదరు పత్రికలో ప్రముఖంగా ప్రచురితమవడంపై పేర్ని నాని చంద్రబాబు ని ప్రశ్నించారు. 

Works for contractors.. Offerings to Chandrababu:

YSRCP alleges graft by Naidu in project construction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs