Advertisement
Google Ads BL

జవాన్ లో కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్సులు


కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ మూవీ జవాన్. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. స్పైరో రజటోస్, యాన్నిక్ బెన్, క్రెయిన్ మ్యాక్రే, కెచా ఖంఫ్కాడె, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు వంటి  యాకన్ కొరియోగ్రాఫర్స్ జవాన్ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేయటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పైన పేర్కొన్న యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ప్రపంచంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు వర్క్ చేశారు. జవాన్ లో భారీ యాకన్ సన్నివేశాలున్నాయి. ఇవన్నీ కథలో భాగంగా ఉంటూనే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనున్నాయి. సాధారణంగా ఒకరు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తేనే ఆశ్చర్యపోతుంటాం. అలాంటిది ఏకంగా 6గురు అత్యుత్తమ యాక్షన్ మాస్టర్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. 

Advertisement
CJ Advs

ఇంటర్నేషనల్ యాక్షన్ వరల్డ్ లో స్పైరో రజటోస్, యాన్నిక్ బెన్, క్రెయిన్ మ్యాక్రే, కెచా ఖంఫ్కాడె, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు వంటి వారికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందువల్లనే జవాన్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బుపరుస్తున్నాయి. ది ఫాస్ట అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, టీనేజ్ మ్యూటెండ్ నింజా  టర్టల్స్ వంటి సినిమాలకు భారీ ఫైట్స్ ను డిజైన్ చేశారు స్పైరో రజటోస్. ఆయన ఇంతకు ముందు షారూఖ్ ఖాన్ రా వన్ సినిమాకు కూడా వర్క్ చేశారు. ఆ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్, యాక్షన్ సన్నివేశాలను అందరూ అప్రిషియేట్ చేసిన సంగతి తెలిసిందే. 

యాన్నిక్ బెన్ విషయానికి వస్తే ఆయన పార్క్ అవర్ ట్యూటర్ వంటి హాలీవుడ్ మూవీకి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. అలాగే ట్రాన్స్ పోర్టర్ 3, డంక్రిక్, ఇన్ సెప్షన్ వంటి హాలీవుడ్ సినిమాలతో పాటు రాయీస్, టైగర్ జిందా హై, అత్తారింటికి దారేది, నేనొక్కడినే వంటి సినిమాలకు ఆయన వర్క్ చేశారు. క్రెయిక్ మాక్రె విషయానికి వస్తే ఆయన మ్యాడ్ మ్యాక్స్:ఫ్యూరీ రోడ్, అవెంజర్స్, ఏజ్ ఆఫ్ ఉల్ట్రాన్ వంటి సినిమాలలోని యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసి మెప్పించారు. ఇక మన సినిమాలలో వార్ సినిమాకు ఈయన కంపోజ్ చేసిన ఫైట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సంగతి తెలిసిందే. 

కెచా ఖంఫాడీ ఇంగ్లీష్ స్టంట్ డైరెక్టర్ ఈయన హాలీవుడ్ సినిమాలతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, తమిళ, తెలుఉ చిత్రాలకు కూడా వర్క్ చేశారు. తుపాకీ, బాహుబలి 2, భాగి 2 వంటి సినిమాలకు వర్క్ చేశారు. బాహుబలి ది కన్ క్లూజన్ సినిమాలో ఈయన కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సునీల్ రోడ్రిగ్స్ షేర్షా, సూర్యవంశీ, పఠాన్ వంటి సినిమాకు వావ్ అనిపించేలా యాక్షన్స్ ను డిజైన్ చేశారు. 

అనల్ అరసు కంపోజ్ చేసే యాక్షన్ సన్నివేశాల గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుల్తాన్, ఖైది, కిక్ వంటి పలు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు ఆయన ఫైట్స్ కంపోజ్ చేశారు. 

షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న జవాన్ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Jawan update :

Actions directors across the world roped in on Jawan to design spectacular action sequences
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs