మాస్ మహారాజా రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యూనిక్ ఎంటర్ టైనర్ ఈగల్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సినిమా టైటిల్ గ్లింప్స్ మంచి అంచనాలను నెలకొల్పింది.
ఈగల్ కొత్త షెడ్యూల్ ఈ రోజు నుండి లండన్ లో ప్రారంభం కానుంది. అందుకే రవితేజ లండన్ బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఈగల్ టీం అక్కడికి చేరుకుంది. ఈ షెడ్యూల్ లో రవితేజ, ఇతర ప్రముఖ తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక.