యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించారు.
అనౌన్స్ మెంట్ నుంచి అందరిలో ఆసక్తి కలిగించింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.