Advertisement
Google Ads BL

పెండింగ్ లో భోళా డిజిటల్ రైట్స్


భోళా శంకర్ పై పెట్టిన కేసు వీగిపోయి.. రేపు శుక్రవారం ఆగష్టు 11 న ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదల కాబోతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్) పెట్టిన కేసుని నాంపల్లి కోర్టు కొట్టేసింది. దానితో భోళా విడుదలకు ఏర్పడిన సమస్యలు తొలిగిపోయాయి. కానీ ఇప్పుడు భోళా శంకర్ థియేట్రికల్ రిలీజ్ కి ప్రాబ్లెమ్ లేకపోయినా.. డిజిటల్ హక్కుల విషయంలో కోర్టు మెలిక పెట్టింది. 

Advertisement
CJ Advs

భోళా శంకర్ సినిమా డిజిటల్ రైట్స్ ను కోర్టు పెండింగ్ లో పెట్టిందని వైజాగ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్), అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ వెల్లడించారు. ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్  అధినేతలు తన దగ్గర బ్యాంకు లావాదేవీ ల రూపంలో 30 కోట్లు తీసుకుని, తనకు రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ను అమలుపరచకుండా తనను మోసం చేశారని డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్),హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. 

తనకు డబ్బులు చెల్లించేంతవరకు భోళా  శంకర్ సినిమా విడుదలను అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ లో నిలుపుదల చేయాలని తాము సిటీ సివిల్ కోర్టులో ఐదు ఐ.ఎ.లు వేయగా నాలుగింటిని డిస్మిస్ చేశారని, భోళా శంకర్ డిజిటల్ రైట్స్ ఐ.ఎ. నెంబర్  304ను మాత్రం పెండింగ్ లో పెట్టడం జరిగిందని  వారు వివరించారు.  శుక్రవారం సాయంత్రానికి కోర్టు ఆర్డర్ కాపీ వస్తే, అందులో పూర్తి వివరాలు తెలుస్తాయని వారు చెప్పారు.

మెయిన్ సూట్ కోర్టులో కొనసాగుతుందని, సెప్టెంబర్ 13వ తేదీ తదుపరి విచారణ జరుగుతుందని వారు పేర్కొన్నారు. గౌరవనీయ కోర్టు తీర్పును మేము శిరసావహిస్తామని, తనకు రావలసిన డబ్బుల విషయంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని బత్తుల సత్యనారాయణ (సతీష్) భరోసా వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ కాపీ అందగానే హైకోర్టుకు వెళుతున్నట్లు వారు తెలిపారు.

Pending Bhola Shankar Digital Rights:

Bhola Shankar is scheduled for a theatrical release on 11 August
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs