Advertisement
Google Ads BL

చిరంజీవి గారికి నేనే కొత్త ఫ్రెండ్: కీర్తి సురేష్


భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ కీర్తి సురేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Advertisement
CJ Advs

ఇంతకుముందు  రజనీకాంత్ గారికి సిస్టర్ గా నటించారు. ఇప్పుడు భోళా శంకర్ లో చిరంజీవిగారికి సిస్టర్ గా కనిపించడం ఎలా అనిపించింది ?

చాలా ఆనందంగా వుంది. రజనీకాంత్ గారితో సినిమా పూర్తిచేసిన తర్వాత భోళా శంకర్ ఆఫర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ తో నటించాను. ఇంతకంటే ఏం కావాలి. చాలా హ్యాపీగా వుంది. భోళాలో మరో గొప్ప విశేషం.. చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవకాశం కూడా దొరికింది. చిరంజీవి గారితో ఒక్క ఫ్రేమ్ లోనైనా డ్యాన్స్ చేయాలని వుండేది. కానీ ఇందులో రెండు పాటల్లో డ్యాన్స్ చేసే అవకాశం దొరికింది.

సిస్టర్ క్యారెక్టర్ అనగానే డ్యాన్స్ చేసే అవకాశం వుండదేమో అని భయపడ్డారా ?

అవును ముందు అలానే భయపడ్డాను. కానీ ఇందులో నా క్యారెక్టర్ కి ఆ స్కోప్ వుంది. అన్నయ్యతో చాలా బబ్లీ, జాలీగా వుండే క్యారెక్టర్ కాబట్టి అది సూపర్ గా కుదిరింది.

ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

ఇది ప్రధానంగా బ్రదర్ సిస్టర్ స్టొరీ. బ్రదర్ సిస్టర్ ఎమోషన్ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పక్కా ప్యాకేజ్ గా వుంటుంది.

ఈ పాత్ర చేస్తున్నపుడు మీ రియల్ లైఫ్ బ్రదర్ బాండింగ్ గుర్తుకు వచ్చిందా ?

నాకు రియల్ లైఫ్ లో సిస్టర్ వుంది. కానీ బ్రదర్ లాంటి ఫ్రండ్స్ చాలా మంది వున్నారు. ఈ సినిమాతో చిరంజీవిగారితో నాకు మంచి ఫ్రండ్షిఫ్ వచ్చేసింది. మా అమ్మగారు 80s గ్రూప్ లో చిరంజీవి గారి ఫ్రండ్. ఇప్పుడు నేనే కొత్త ఫ్రండ్ (నవ్వుతూ)

సెట్స్ లో చిరంజీవి గారిని ఏమని పిలిచేవారు ?

చిరుగారు అనే పిలిస్తాను.

మీ అమ్మగారు చిరంజీవి గారితో నటించారు. చిరంజీవి గారి గురించి ఏవైనా విషయాలు పంచుకున్నారా ?

చిరంజీవి గారితో అమ్మ పున్నమినాగు చిత్రంలో నటించారు. అప్పటి చాలా విషయాలు అమ్మ నాకు చెప్పింది. చిరంజీవి గారి ఎనర్జీ, డెడికేషన్, అలాగే సెట్ లో ఇచ్చిన సలహాలు సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్  గా  చూసుకునేవారట. అమ్మ చాలా చిన్న వయసులో సినిమాల్లో వచ్చింది. అప్పుడు ఒక చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఈ విషయాన్ని చిరంజీవి గారితో నేను చెప్పినపుడు.. చిరంజీవి రియాక్షన్ నాకు చాలా సర్ప్రైజ్ చేసింది. ‘’మీ అమ్మగారు ఇంతే చెప్పిందా .. నేను తనతో ఇంకా చాలా చెప్పాను’ అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి చిన్న విషయం ఆయనకి గుర్తువుంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన ఇంత గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ‘మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు. స్ట్రీట్ స్మార్ట్ నువ్వు’ అని చిరంజీవి గారు అన్నారు( నవ్వుతూ)

చిరంజీవి గారు సెట్ లో మీకు ఏమైనా సూచనలు ఇచ్చారా ?

చాలా విలువైన సూచనలు ఇచ్చారు. ఇలా చేస్తే బావుటుందని చెప్పేవారు. రోజు చిరంజీవి గారి ఇంటి నుంచి భోజనం  వచ్చేసేది. నాకు ఫలానాది కావాలని అడిగి మరీ తెప్పించుకునే దాన్ని. (నవ్వుతూ) ఫుడ్ అనేది మా మధ్య మెయిన్ టాపిక్ అయిపొయింది. ఉలవచారు,కాకరకాయ తెగ నచ్చాయి. ప్రతి రోజు ఇంటి నుంచి ఏం వస్తుందో మెనూ చెప్పేవారు. బ్యూటీఫుల్ జర్నీ ఇది.

తమన్నాగారు మాట్లాడుతూ కీర్తిసురేష్ దేశంలోనే అత్యుత్తమ నటి అన్నారు ? మీ కాంబినేషన్ సీన్స్ ఎలా వుంటాయి ?

తమన్నా గారు ఇందులో కామెడీ బ్యూటీఫుల్ గా చేశారు. డబ్బింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. తమన్నా, చిరంజీవి గారి కాంబినేషన్ సీన్స్ చాలా బావుంటాయి. ఇప్పుడు తమన్నా గారు ఫుల్ ట్రెండింగ్ లో వున్నారు. తనకి జైలర్, భోళా శంకర్ రెండు రిలీజ్ లు వున్నాయి. ఇలా ఒకేసమయంలో ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ తో చేయడం, అవి ఒకేసారి విడుదల కావడం నిజంగా తమన్నా అదృష్టం.  

మీరు హీరోయిన్ గా చేస్తూనే.. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు, కీలకమైన పాత్రలు చేస్తున్నారు కదా .. ఎలా అనిపిస్తుంది ?

చూడటానికి ఈజీగా వుంటుంది కానీ ఇలా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం (నవ్వుతూ). అన్నీ సినిమాలు చేయలనేది నా కోరిక. పదేళ్ళ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకున్నపుడు ఇది మనం చేయలేదే అని అనిపించకూడదు. సాధ్యమైన అన్ని పాత్రలు చేయాలని వుంటుంది.

నాయకుడుతో హిట్ కొట్టారు.. ఇప్పుడు భోళాతో హ్యాట్రిక్ కొడతారని భావిస్తున్నారా?

కొట్టిన తర్వాత చెప్తాను. అది నాకు మైండ్ లో వుంది. ఆగస్ట్ 11 కోసం వెయిటింగ్. హిట్టు కొట్టాక ముందు దాని గురించే మాట్లాడతాను.

దర్శకుడు మెహర్ రమేష్ గురించి ?

మెహర్ గారు ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఐతే అప్పుడే రజనీకాంత్ గారికి సిస్టర్ గా చేశాను కదా అని ఆయనతో చెప్పాను. పర్వాలేదని అన్నారు.  మెహర్ గారు అందరినీ చాలా కంఫర్ట్ ఫుల్ గా చూసుకుంటారు. ఆయనకి  కమర్షియల్ మీటర్ , ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. నిజానికి మెహర్ గారిని అన్నయ్యలా భావిస్తున్నాను. ఈ సినిమాతో తనకో చెల్లి దొరికింది నాకో అన్నయ్య దొరికారు. (నవ్వుతూ).

ప్రతి సినిమాలో మీ కాస్ట్యూమ్ చాలా యునిక్ గా , పద్దతిగా వుంటాయి.. దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?

పాత్రకు ఏం కావాలో అది చేస్తాను. ఏదైనా పాత్ర ప్రకారమే వుంటుంది. అయితే ఒక పాత్రకు ఏది యాప్ట్ గా వుంటుదనేదానిపై ప్రత్యేక శ్రద్ధతీసుకుంటాను. భోళా శంకర్ లో కాస్ట్యూమ్స్ కలర్ ఫుల్ గా వుంటాయి . సినిమా అద్భుతంగా వచ్చింది.  

Keerthy Suresh Interview :

Keerthy Suresh Interview about Bholaa Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs