Advertisement
Google Ads BL

బిగ్ స్టార్స్ తో నా కల నెరవేరింది: తమన్నా


బిగ్గెస్ట్ స్టార్స్ తో నా కల నెరవేరింది: తమన్నా  

Advertisement
CJ Advs

చిరంజీవి గారు, రజనీకాంత్ గారితో కలిసి పని చేయడంతో నా కల నెరవేరింది. భోళా శంకర్, జైలర్ రెండూ డిఫరెంట్ ఎంటర్ టైనర్స్: హీరోయిన్ తమన్నా భాటియా

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్‌. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ లో తమన్నా భాటియా కథానాయికగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ల క్రేజీ ప్రాజెక్ట్ జైలర్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు తమన్నా. ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న భోళా శంకర్ ఆగస్ట్ 11న, జైలర్ ఆగస్ట్10న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ రెండు చిత్రాలలో నటించిన హీరోయిన్ తమన్నా విలేకరుల సమావేశంలో సినిమాల విశేషాలని పంచుకున్నారు.

ఒక రోజు గ్యాప్ లో మీరు నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు విడుదలౌతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ?

చాలా ఆనందంగా వుంది. రెండు సినిమాలు అన్నీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్. వారితో కలసి నటించడంతో నా కల నెరవేరినట్లయింది.

సైరాలో చిరంజీవిగారితో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు కదా.. భోళా శంకర్ తో ఆ  లోటు తీరిందా ?

అవును. పాట పేరు కూడా మిల్కీ బ్యూటీ అని పెట్టారు. రియల్లీ క్యూట్. చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవకాశం రావడం చాలా అదృష్టం. డ్యాన్స్ లో ఇప్పుడు వాడుతున్న చాలా స్టయిల్స్ ఆయన దగ్గర నుంచే వచ్చాయి. భోళా శంకర్ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా.

చిరంజీవి గారితో డ్యాన్స్ అంటే ఎలా రిహార్సల్ చేశారు ?

మిల్కీ బేబీ పాట రొమాంటిక్ మెలోడి. ఒక హుక్ స్టెప్ వుంటుంది. అలాగే చాలా గ్రేస్ ఫుల్ మూమెంట్స్ వుంటాయి. స్విజ్జర్లాండ్ లో చాలా బ్యూటీఫుల్ గా షూట్ చేశాం.

భోళా శంకర్, జైలర్ చిత్రాలలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?

భోళా శంకర్, వేదాళంకు రీమేక్. ఐతే మెహర్ రమేష్ గారు చాలా మార్పులు చేశారు. నా పాత్ర కొత్తగా వుంటుంది. నిజానికి నా పాత్ర ఒరిజినల్ లో అంత వుండదు. ఇందులో చాలా డిఫరెంట్ గా క్యారెక్టరైజేషన్ వుంటుంది. జైలర్ విషయానికి వస్తే.. అందులో స్మాల్ పార్ట్ లో కనిపిస్తా. క్యారెక్టర్ పరంగా రెండూ డిఫరెంట్ సినిమాలు. ఆడియో పరంగా జైలర్ లో కావలయ్య పాట చాలా మందికి రీచ్ అయ్యింది. భోళా శంకర్ లో నాది ఫుల్ లెంత్ రోల్. ఈ సినిమాతో చాలా అసోసియేషన్ వుంది.  

మెహర్ రమేష్ గారి వర్కింగ్ స్టయిల్ ఎలా వుంటుంది ?

మెహర్ రమేష్ గారు చాలా క్యాజువల్ గా వుంటారు. ఇందులో నా పాత్రకు హ్యుమర్ వుంటుంది. సెట్స్ లో చాలా జాలీగా గడిచింది. హ్యూమర్, కామెడీని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. మెహర్ గారు హ్యూమర్ ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.

కాళిదాస్ తర్వాత సుశాంత్ తో మళ్ళీ వర్క్ చేశారు కదా ?

అవునండీ. నిజంగా ఇది వండర్ ఫుల్ జర్నీ. తనతో మళ్ళీ కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఇందులో చాలా డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాం.

కీర్తి సురేష్ తో కాంబినేషన్ సీన్స్ చేయడం ఎలా అనిపించిది ?

కీర్తి సురేష్ అత్యుత్తమ నటి. తను ఇంటెన్స్ సీన్స్ తో పాటు అన్నీ ఎమోషన్స్ ని సెటిల్డ్ అండ్ బ్యాలెన్సింగా చేస్తుంది. తనతో కలసి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాతో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం.

భోళా శంకర్ సెట్స్ లో గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఏవైనా ఉన్నాయా ?

భోళా శంకర్ లో అద్భుతమైన తారాగణంతో పని చేశాం. భోళా శంకర్ నాకు చాలా మంచి అనుభవం. అన్నీ ఎలిమెంట్స్ వుండే కమర్షియల్ సినిమా చేశాను. ప్రేక్షకులకు కూడా నచ్చితుందనే నమ్మకం వుంది.

మీరు రామ్ చరణ్ గారితో కూడా పని చేశారు కదా.. చిరంజీవి గారికి చరణ్ కి ఎలాంటి పోలికలు గమనించారు ?

ఇద్దరూ అద్భుతమైన వ్యక్తులు. చాలా సపోర్టివ్ గా వుంటారు. నా కెరీర్ బిగినింగ్ నుంచి చాలా సపోర్టివ్ గా వున్నారు. చరణ్, చిరంజీవి గారితో వర్క్ చేయడం మంచి అనుభవం.

ఏకె ఎంటర్ టైన్మెంట్స్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

ఇంతకుముందే వారితో పని చేశాను. చాలా మంచి నిర్మాతలు. సినిమా అంటే వారికి చాలా ప్యాషన్. ఈ సినిమా ప్రయాణంలో ఎంతగానో సపోర్ట్ చేశారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సింది సమకూర్చారు.  ఏకె ఎంటర్ టైన్మెంట్స్ తో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.

భోళా శంకర్ మ్యూజిక్ గురించి ?

పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. మిల్కీ బ్యూటీ, జామ్ జామ్ పాటలు నాకు నాకు చాలా నచ్చాయి. జామ్ జామ్ పాటలో నర్సపల్లి అనే ట్విస్ట్ పెట్టడం పార్టీ సాంగ్ కి మరింత అందాన్ని తీసుకొచ్చింది. అది గొప్ప ఆలోచన.

కొత్త సినిమాల గురించి ?

తమిళంలో అరణం అనే సినిమా చేస్తున్నా. మలయాళంలో బాంద్ర సినిమా విడుదలకు సిద్ధమౌతుంది. అలాగే హాట్ స్టార్ లో ఓ వెబ్ సిరిస్ చేస్తున్నా.

My dream came true with the biggest stars: Tamannaah:

Tamannaah interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs