Advertisement
Google Ads BL

VD13 సెట్స్ లో మృణాల్ బర్త్ డే సెలెబ్రేషన్స్


గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా పరుశురాం తెరకెక్కిస్తున్న మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ (VD13) పదమూడో చిత్రంగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో (SVC54) 54వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ మధ్యే మూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement
CJ Advs

రీసెంట్‌గా సినిమా టీం అంతా కలిసి లోకేషన్ల వేటను పూర్తి చేశారు. ఇప్పుడు షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో నటిస్తున్నారు. నేడు (ఆగస్ట్ 1) ఆమె పుట్టిన రోజు. 

ఈ సందర్భంగా సెట్‌లో ఆమె బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది చిత్రయూనిట్. సెట్‌లో ఆమె చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఆ ఫోటోల్లో మృణాల్ నవ్వులు చిందిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ లుక్స్ సరికొత్తగా ఉన్నాయి. ఈ ఫోటోల్లో యంగ్ నిర్మాత హన్షిత రెడ్డి, శిరీష్‌లు కూడా ఉన్నారు.

Team VD13 celebrated Mrunal Thakur Birthday :

Team VD13 / SVC54 celebrated Heroine Mrunal Thakur Birthday on the sets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs