Advertisement
Google Ads BL

అనుకున్న డేట్ కే టైగర్ నాగేశ్వరరావు


మాస్ మహారాజా రవితేజ  టైటిల్ రోల్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావుతో వస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకు అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో టైగర్ నాగేశ్వరరావు విడుదలలో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేస్తూ మేకర్స్ ఓ అనౌన్స్ మెంట్  విడుదల చేశారు.

Advertisement
CJ Advs

టైగర్‌నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కావడం లేదని నిరాధారమైన ఊహాగానాలు వచ్చాయి. కొన్ని శక్తులు ఈ రూమర్స్ ని  వ్యాప్తి చేస్తున్నాయి. ఎందుకంటే మా చిత్రం ప్రేక్షకుల నుంచి గొప్ప ఆసక్తిని సంపాదించింది. థియేట్రికల్ ఎకోసిస్టమ్‌లోని వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి మొదటి ప్రాధాన్యత పొందింది. ఎలాంటి వదంతులను నమ్మవద్దు. మీకు అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాము. అక్టోబరు 20 నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద టైగర్  వేట ప్రారంభమవుతుంది అని మేకర్స్ తెలియజేశారు.

కొన్ని నెలల క్రితం రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జ్ (గోదావరి)పై ఫస్ట్-లుక్ పోస్టర్ , కాన్సెప్ట్ వీడియోను లాంచ్ చేయడం ద్వారా మేకర్స్ సినిమా ప్రమోషన్‌లను  యూనిక్ స్టయిల్ లో  ప్రారంభించారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు వంశీ ఒక విన్నింగ్ స్క్రిప్ట్‌ని ఎంచుకుని, దానిని ఆకట్టుకునే రీతిలో ప్రజంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.

Tiger Nageswara Rao Releasing On October 20, Without Any Delay:

Mass Maharaja Ravi Teja Pan Indian Film Tiger Nageswara Rao Releasing On October 20
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs