Advertisement
Google Ads BL

ఆగస్ట్ 4న కిచ్చాసుదీప్‌ హెబ్బులి


ఎమ్‌ మోహన శివకుమార్‌ సమర్పణలో సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ పతాకంపై కిచ్చసుదీప్‌, అమలాపాల్‌ జంటగా ఎస్‌కృష్ణ దర్శకత్వలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ హెబ్బులి. ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకోవడమే కాకుండా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  ప్రపంచ వ్యాప్తంగా ఆగుస్ట్ 4న గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్బంగా 

Advertisement
CJ Advs

చిత్ర నిర్మాత సి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది.కన్నడలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి 100 కోట్లు  సాధించిన పక్కా కమర్షియల్ మూవీ.అందుకే తెలుగు లో విడుదల చేస్తున్నాను.

ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు.  ఎ. కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. సౌండ్‌ట్రాక్ మరియు ఫిల్మ్ స్కోర్‌ను అర్జున్ జన్య స్వరపరిచారు.అన్ని  కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 4న గ్రాండ్ గా తెలుగులో  ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న మా "హెబ్బులి" సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Hebbuli on 4th August:

Kiccha Sudeep Hebbuli on 4th August
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs