Advertisement
Google Ads BL

విజువల్ ట్రీట్‌గా విజయ్-సమంత ఖుషి సాంగ్


డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పుడు మేకర్లు మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో చేపడుతున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా ఖుషి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఖుషి అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. ఇక  హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక ఇందులో విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. ఈ మెలోడీ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారనుంది.

ఇప్పటికే ఖుషి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇన్ స్టాగ్రాం రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ ట్రెండ్ అవుతూనే ఉంది. రెండో పాట ఆరాధ్య సైతం శ్రోతలను కట్టి పడేసింది. ఇప్పుడు ఈ మూడో పాట ఖుషి సైతం చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

Kushi title song out now :

Vijay Deverakonda and Samantha Kushi title song out now 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs