Advertisement
Google Ads BL

రామ్ చరణ్ చేతుల మీదుగా భోళా ట్రైలర్


మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా మాసీవ్ ప్రమోషనల్ కంటెంట్ తో స్ట్రాంగ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. టీజర్‌ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషన్‌ ఎలిమెంట్ హ్యుజ్ బజ్‌ నెలకొల్పింది.

Advertisement
CJ Advs

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేపు సాయంత్రం 4:05 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్‌ని రామ్ చరణ్ లాంచ్ చేయడం వల్ల ఇది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.

తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Ram Charan To Launch The Theatrical Trailer Of Bholaa Shankar :

Global Star Ram Charan To Launch The Theatrical Trailer  Bholaa Shankar Tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs