Advertisement
Google Ads BL

యాక్ష‌న్ సీన్స్ తో వావ్ అనిపించనున్న జ‌వాన్‌


బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ జ‌వాన్‌. ఈసినిమాలో ఆయ‌న చేసిన ఫైట్స్ ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేయ‌టం ఖాయం. ఆయ‌న త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌నున్నారు. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను రేపు భారీ స్క్రీన్‌పై చూసిన‌ప్పుడు ప్రేక్ష‌కులకు ఓ విజువ‌ల్ ఎక్స్‌పీరియెన్స్ రావ‌టం ప‌క్కా. హాలీవుడ్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, కెప్టెన్ అమెరికా వంటి టాప్ మోస్ట్ యాక్ష‌న్ మూవీస్‌కి యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన ప్ర‌ముఖ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ స్పిరో ర‌జ‌టోస్.. జ‌వాన్‌ సినిమాకు యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను కంపోజ్ చేశారు. 

Advertisement
CJ Advs

ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, కెప్టెన్ అమెరికా, వెనోమ్‌, స్టార్ ట్రెక్‌, టీనేజ్ ముటంట్ నింజా ట‌ర్ట‌ల్స్ వంటి సినిమాల‌కు ప‌నిచేసిన అపార‌మైన అనుభ‌వంతో స్పిరో ర‌జ‌టోస్ జ‌వాన్ సినిమాకు క‌ళ్లు చెదిరే, వావ్ అని ఆశ్చ‌ర్య‌పోయేలా యాక్ష‌న్ సన్నివేశాల‌ను డైరెక్ట్ చేశారు. 

మ‌ల్టీ టాలెంటెడ్ స్టంట్ మ్యాన్‌, స్టంట్ కో ఆర్టినేట‌ర్‌, డైరెక్ట‌ర్‌గా పేరున్న స్పిరో ర‌జ‌టోస్ హాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేశారు. ఆయ‌న యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు బెస్ట్ స్టంట్ కో ఆర్టినేట‌ర్‌గా టార‌స్ అవార్డుతో పాటు 2004లో విడుద‌లైన బ్యాడ్ బాయ్స్ IIకి మూడు అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. ఆయ‌న అనుభ‌వం, క్రియేటివిటీతో `జ‌వాన్‌` సినిమాను నెక్ట్స్ రేంజ్‌లో చూడొచ్చన‌టంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ఫైట్స్ అద్భుతంగా వావ్ అనిపించేలా ఉండ‌బోతున్నాయి. 

రేపు వెండితెర‌పై జవాన్‌ సినిమాను చూస్తున్న‌ప్పుడు స్పిరో ర‌జ‌టోస్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను షారూఖ్ స్క్రీన్‌పై అద్భుతంగా ప్ర‌దర్శిన్న‌ప్పుడు ప్రేక్ష‌కులు తెలియ‌ని ఉద్వేగానికి లోన‌వుతారు. వీరిద్ద‌కి క‌ల‌యిక‌లో రానున్న జ‌వాన్ యాక్ష‌న్ సీన్స్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌ను వేస్తుంది. 

రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో.. అట్లీ ద‌ర్శ‌కత్వంలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌవ‌ర్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.

Captain America fame designs actions sequences in Jawan:

Jawan - Get Ready for Unforgettable Action Sequences!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs