Advertisement
Google Ads BL

భోళా శంకర్ నుంచి జామ్ జామ్ జజ్జనక


మెగాస్టార్ చిరంజీవి మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ నుంచి ఒక పాట చిత్రీకరణ జరుగుతుండా ఒక వీడియోను లీక్ చేసారు మెగాస్టార్. ఆ పాట మేకింగ్‌లోని గ్రాండ్‌నెస్ చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు, మేకర్స్ జామ్ జామ్ జజ్జనక  పాటను విడుదల చేశారు.

Advertisement
CJ Advs

ఇది భోళా శంకర్ గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్. మహతి స్వర సాగర్ పార్టీ, సెలబ్రేషన్ వైబ్‌లను కలిగి ఉన్న పాటని స్వరపరిచారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలాపించారు. కాసర్ల శ్యామ్ మాస్ ని ఆకట్టుకునే లిరిక్స్ అందించారు.  మధ్యలో పాపులర్ ఫోక్ నెంబర్ నర్సపల్లెని మిక్స్ చేయడంతో పార్టీ వైబ్ మరొక స్థాయికి వెళ్ళింది.  

చిరంజీవి డాన్స్ మూమెంట్స్ మెస్మరైజింగా వున్నాయి. పాటలో లైవ్లీగా కనిపించారు మెగాస్టార్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో చిరంజీవితో పాటు తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ అలరించారు. సంగీత్, ఇతర వేడుకలకు ఈ పాట ఫస్ట్ ఛాయిస్ గా నిలవనుంది.

అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది

Bholaa Shankar- Jam Jam Jajjanaka is out now:

Chiranjeevi Bholaa Shankar- Jam Jam Jajjanaka is out now
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs