Advertisement
Google Ads BL

జవాన్ ప్రివ్యూ: డేట్, టీమ్ ఫిక్స్


ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ జవాన్. ప్యాన్స్, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న జవాన్ ప్రివ్యూకి డేట్, టైమ్ ఖరారైంది. జూలై 10, ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్న‌ట్లు కింగ్ ఖాన్ షారూక్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో అభిమానులు, ప్రేక్ష‌కుల అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

Advertisement
CJ Advs

జవాన్ సినిమాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఈ మూవీ ఎలా ఉండ‌బోతుందా? అస‌లు షారూక్ ఖాన్ స్టార్ డ‌మ్‌ను అట్లీ ఎలా చూపించ‌బోతున్నారు? అస‌లు సినిమా అన్నీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటుందా? అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. సినీ ప్రేక్ష‌కులు, మీడియా వ‌ర్గాలన్నీ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణంలో ప్రివ్యూ డేట్‌, టైమ్ ప్ర‌క‌టించారు. దీంతో  సినిమాపై  జాతీయ స్థాయిలో సోష‌ల్ మీడియా స‌హా ఇత‌రత్రా వాటిలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

క్యాలెండ‌ర్‌లో జ‌వాన్ ప్రివ్యూ డేట్‌ను మార్క్ చేసుకోండి. మాతో పాటు కౌండ‌ట్ డౌన్‌లో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు షారూక్ ఖాన్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌ని విధంగా చూడ‌బోతున్నారు. ఈ సినిమాటిక్ జ‌ర్నీ ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన అనుభూతిని అందిచ‌నుందన‌టంలో సందేహం లేదు. మ‌రింత ఎగ్జ‌యిట్‌మెంట్‌, అప్‌డేట్స్ కోసం ఎదురు చూసేలా ప్రివ్యూ డేట్ అనౌన్స్‌మెంట్ సిద్ధం చేసింది.

Shah Rukh Khan Jawan Prevue to Drop on 10 July at 10:30am:

Mark Your Calendars: Shah Rukh Khan Jawan Prevue to Drop on 10 July at 10:30am
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs