Advertisement
Google Ads BL

షారుఖ్ జవాన్ మ్యూజిక్‌ రైట్స్‌కి భారీ డీల్


బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ జవాన్. బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను రూ.36 కోట్ల‌కు  ప్ర‌ముఖ సంస్థ టి సిరీస్ సొంతం చేసుకోవ‌టం టాక్ ఆఫ్ ది మూవీ ఇండ‌స్ట్రీగా మారింది. 

Advertisement
CJ Advs

జవాన్ సినిమా మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకోవటానికి చాలా మంది పోటీ పడ్డారు. అయితే టి సిరీస్ సంస్థ రూ.36 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకోవటం విశేషం. 

జవాన్ చిత్రం మ్యూజిక్ రైట్స్ కోసం రూ.36 కోట్లు రావ‌టం స‌రికొత్త రికార్డ్‌. దీంతో షారూక్ ఖాన్ మ‌రోసారి త‌న స్టార్ ప‌వ‌ర్‌ను ప్రూవ్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ఎక్స్‌క్లూజివ్‌, జ‌వాన్ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను రూ.36 కోట్లకు టి సిరీస్ సొంతం చేసుకుంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్‌. మ‌రోసారి షారూక్ ఖాన్ త‌న ఆధిప‌త్యాన్ని చూపించారు అని తెలియజేశారు. 

పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత షారూక్ ఖాన్ చేస్తోన్న సినిమా కావటంతో జవాన్ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంత భారీ మొత్తానికి మ్యూజిక్ రైట్స్ అమ్ముడ‌వ‌టం మ‌రోసారి సినీ స‌ర్కిల్స్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Jawan Music Rights Smash Records with Whopping Deal!:

SRK Jawan Music Rights Smash Records with Whopping ₹36 Crores Deal!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs