ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ K అనౌన్స్ చేసినప్పటి నుంచి హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు సినిమా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. కమల్ హాసన్ ప్రాజెక్ట్ కెలో చేరడంతో ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ స్టార్ కాస్ట్ వున్న చిత్రంగా ప్రాజెక్ట్ కె నిలిచింది.
దీనిపై ఉలగనాయగన్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. 50 సంవత్సరాల క్రితం నేను డ్యాన్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నిర్మాణ రంగంలో అశ్వినీదత్ అనే పేరు పెద్దగా వినిపించింది. 50 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి వస్తున్నాం. ఈ చిత్రానికి నెక్స్ట్ జనరేష్ బ్రిలియంట్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. నా సహనటులు మిస్టర్ ప్రభాస్, దీపిక కూడా ఆ తరం వారే. నేను ఇంతకు ముందు అమిత్ జీ తో కలిసి పనిచేశాను. అయినా ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. అమిత్ జీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉన్నారు. నేను కూడా ఆ ప్రక్రియను అనుకరిస్తున్నాను. నేను ప్రాజెక్ట్ K కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు నన్ను ఏ స్థానంలో ఉంచినా, నా మొదట స్వభావం నేను సినిమా అభిమానిని. నా పరిశ్రమలో ఏ కొత్త ప్రయత్నమైనా ఆ స్వభావం మెచ్చుకుంటూనే ఉంటుంది. ప్రాజెక్ట్ K కి నాదే మొదటి ప్రశంస. మా దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ తో మన దేశం, సినిమా ప్రపంచం అంతా ప్రశంసలు మార్మ్రోగుతాయని నేను ఖచ్చితంగా చెబుతున్నాను అన్నారు