Advertisement
Google Ads BL

ఎన్ఠీఆర్ మాకు దేవుడు -కె. పద్మనాభయ్య


నందమూరి తారక రామారావు గారు తెర మీద పోషించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవెంకటేశ్వర స్వామి, శివుడు, మహా విష్ణువు పాత్రలతో ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారని, తాను కూడా రామారావు గారిని అదే దృష్టి తో చూస్తానని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి కే. పద్మనాభయ్య తెలిపారు. 

Advertisement
CJ Advs

ఎన్. టి. ఆర్ శత జయతి వేడుకల్లో భాగంగా కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ, ఎన్. టి. ఆర్. ఇంటర్నేషనల్ క్యారికేచర్, పోయెట్రీ అవార్డులు మరియు సేవ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని జింఖానా లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పద్మనాభయ్య పాల్గొన్నారు. రామారావు గారు నటుడుగా, రాజకీయ నాయకుడుగా చరిత్ర సృష్టించారని, తెలుగు జాతికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయుడని చెప్పారు. 

మరో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇన్ కం టాక్స్ కమీషనర్ జీవన్ లాల్ మాట్లాడుతూ.. ఈరోజు ఇలా కమీషనర్ గా ఉన్నానంటే అది రామారావు గారు పెట్టిన భిక్షే. అప్పుడు వారు గురుకుల పాఠశాలలు ప్రారంభించడం వల్లనే, ఆర్ధిక స్తోమతు లేని నేను అక్కడ చదివానని ఆయన చెప్పారు. తెలుగంటే నాకు ఎంతో మక్కువ, తెలుగు భాషకు, సంస్కృతికి రామారావు గా చేసిన కృషి అనన్య సామాన్యమని జీవన్ లాల్ చెప్పారు. మధ్య యుగాల నాడు కృష్ణదేవరాలయాలు తెలుగు భాషకు ఎంతో సేవ చేశారని, మళ్ళీ శతాబ్దాల తరువాత రామారావు గారు తెలుగు వల్లభుడుగా కీర్తిగాంచారని చెప్పారు. 

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రామారావు గారు నివసించిన నిమ్మకూరులోనే తమ కుటుంబం ఉండేదని, అదే ప్రాంగణంలో తాము కూడా వుండేవారిమని, వారి గొడ్లసావడి లోనే తాను జన్మించానని చెప్పారు. రామారావు గారి స్ఫూర్తి తోనే తాను కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టానని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. గజల్ శ్రీనివాస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ తరం పెద్ద వారిని గౌరవించాలని, నేడు ఫాదర్స్ డే సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం తో పాటు ఆప్యాయంగా చూసుకోవాలని చెప్పారు. 

ఎన్. టి.ఆర్. సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ సభ్యులు అట్లూరి నారాయణ రావు, భగీరథ అతిధులకు, తమ కమిటీ ప్రచురించిన శకపురుషుడు ఎన్. టి. ఆర్. శాసన సభ ప్రసంగాలు, ఎన్. టి. ఆర్ చారిత్రిక ప్రసంగాలు, పుస్తకాలను బహుకరించారు. 

కలయిక ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేరాల నారాయణ రావు, పద్మనాభయ్య, జీవన్ లాల్, రాజేంద్ర ప్రసాద్ ద్వారా ఇంటర్నేషనల్ క్యారికేచర్, పోయెట్రీ అవార్డులు ప్రదానోత్సవం చేశారు. భగీరథ, అట్లూరి నారాయణ రావు, స్వామి, మిమిక్రి రమేష్ తదితరులను  ఎన్. టి. ఆర్ సేవా పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమానికి ముందు మిమిక్రి రమేష్ వివిధ వ్యక్తుల కంఠాలను అనుకరించారు.

N. T. R Shatha Jayanti Celebrations:

N. T. R is God for us -K. Padmanabhaya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs