Advertisement
Google Ads BL

ఫైనల్లీ 29న స్పై


కార్తికేయ 2 లాంటి ఫ్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిఖిల్ నుండి వస్తున్న స్పై థ్రిల్లర్ స్పై విడుదల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఫ్యాన్ ఇండియా మూవీగా రాబోతుగా నిఖిల్ స్పై ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఫైనల్లీ ఇప్పుడు పక్కా రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకుంది.

Advertisement
CJ Advs

వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లో జూన్ 29న విడుదలకు సిద్దం అవుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నికిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్పై. రెండవ ప్రపంచ యుద్దంలో అజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షాలది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ద స్పూర్తిని నింపిన సుభాష్ చంద్రబోస్.. యుద్దసమయంలో 1945లో ప్లేన్ క్రాష్ కు గురియ్యారు. ఆ ఘటనతో భారతీయ చరిత్ర సుభాష్ చంద్రబోస్ ఆచూకిని కోల్పొయింది. ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. అలాంటి పవర్ ఫుల్ స్టోరీలో దాగి ఉన్న అనేక రహస్యాలను ఎంతో రీసెర్చ్ చేసి స్పై సినిమా కథను నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి అందించారు. ఈ కథను అంతే ఉత్కంఠభరితంగా, ప్రేక్షకులకు గూజ్ బంప్స్ వచ్చేలా చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు గ్యారీ బీహెచ్. అలాగే ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఇది వరకే స్పై సినిమాకు సంబంధించిన టీజర్, పాట విడుదలై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.  

భారదేశ అత్యుత్తమమైన రహస్య కథను చిత్రంగా తెరకెక్కించిన స్పై మూవీ చరిత్రలో నిలిచిపోతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం,కన్నడ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లో జూన్ 29 న గ్రాండ్ గా విడుదలకు రంగం సిద్దం అయింది. సినిమాకు ప్రాణం అయిన నేపథ్యసంగీతాన్ని శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ ఇద్దరు కలిసి అందించారు. సీతారామమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత విశాల్ చంద్రశేఖర్, మేజర్, డీజే టిల్లు, హిట్ లాంటి సూపర్ డూపర్ సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఇద్దరు కలిసి స్పై సినిమాకు సంగీత దర్శకులుగా పనిచేయడం విశేషం. అలాగే వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ లు ఇద్దరూ ఉత్కంఠభరితమైన విజువల్స్ ను అందించనట్లు తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్ని ముగించుకొని జూన్ 29న విజయవంతంగా స్పై చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు మేకర్స్ అధికారింగా ప్రకటించారు. సినిమా అవుట్ పుట్ పై ఎంతో నమ్మకంగా ఉన్న చిత్ర యూనిట్ స్పై మూవీ కచ్చితంగా ఇండియన్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు.

Spy to hit screens worlwide on June 29 :

Nikhil Siddhartha Spy to hit screens worlwide on June 29
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs