Advertisement
Google Ads BL

శ్రీలీలని విష్ చేసిన భగవంత్ కేసరి టీమ్


గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ భగవంత్ కేసరి టీజర్ లో మునుపెన్నడూ చూడని లుక్ లో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ గత రికార్డులను బద్దలు కొట్టింది.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై శ్రీలీల తన అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంది. బ్లాక్ ఎథ్నిక్ వేర్ ధరించి, ప్లజంట్ గా కనిపిస్తుంది. సింపుల్ గర్ల్ గా నల్ల దారం, చెవిపోగులు ధరించింది.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

భగవంత్ కేసరి విజయదశమి (దసరా)కి థియేటర్లలో విడుదల కానుంది.

Team Bhagavanth Kesari Unveils First Look Of Sreeleela :

Team Bhagavanth Kesari Unveils First Look Of Sreeleela On Her Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs