బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కి అంతర్జాతీయంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది పఠాన్ చిత్రంతో ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి హిస్టరీ క్రియేట్ చేశారాయన. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆయనెప్పుడు తన అభిమానులతో చాలా సన్నిహితంగా ఉంటుంటారు. ప్రతీ నెల #AskSRK అనే పేరుతో ఆయన ఫ్యాన్స్‌తో మాట్లాడుతుంటారు. వాళ్లు అడిగే ప్రశ్నకు ఆయన చమత్కారంగా సమాధానం చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జూన్‌లో ఆయన మరోసారి #AskSRK సెషన్‌లో పాల్గొన్నారు.
* జవాన్ ను చూడాలనుకుంటున్నా..
ఈ సాయంత్రం మీ ప్లానింగ్ ఏంటి? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు షారూక్ సమాధానం ఇస్తూ అట్లీతో కలిసి జవాన్ సినిమాను చూడాలనుకుంటున్నాను అన్నారు.
* ఛాలెంజింగ్ మూవీ...
ప్రస్తుతం మీరు డంకీ, జవాన్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సినిమా ఏది? అని అడిగితే.. జవాన్ అని అందుకు కారణం అందులో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటమేనని అన్నారు.
* సెప్టెంబర్ 7న కలుద్దాం..
ఓ అభిమాని షారూక్ ఖాన్‌తో జవాన్ నుంచి ఓ ఫొటోను అయినా చూపించాలని రిక్వెస్ట్ చేయగా.. తప్పకుండా సెప్టెంబర్ 7న కలుద్దాం అని సమాధానం చెప్పారు షారూక్.
* విజయ్ సేతుపతితో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్..
జవాన్ లో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతితో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి ఓ అభిమాని అడిగినప్పుడు విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు. నేనెంతో అభిమానించే నటుడు. జవాన్‌లో అతనితో నటించటం ఓ కూల్ ఎక్స్‌పీరియెన్స్.