Advertisement
Google Ads BL

మాచో స్టార్ గోపీచంద్ భీమా ఫస్ట్ లుక్


మాచో హీరో గోపీచంద్ తన 31వ సినిమా కోసం ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్షతో చేతులు కలిపారు. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 14గా నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Advertisement
CJ Advs

గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ చిత్రానికి భీమా అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని లాక్ చేసారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గోపీచంద్ ఫెరోషియస్ పోలీసు అధికారిగా ఇంటెన్స్ రోల్ లో కనిపించారు. ఫస్ట్ లుక్ గోపీచంద్ ఆవేశపూరితంగా చూస్తూ రగ్గడ్ లుక్ కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక ఎద్దును కూడా మనం చూడవచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాలో గోపీచంద్ వైల్డ్ క్యారెక్టర్‌ని సూచిస్తుంది.

కన్నడలో పలు బ్లాక్‌బస్టర్‌లను అందించిన హర్ష ఈ భారీ బడ్జెట్ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భీమా రూపొందనుంది.

ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, కిరణ్ ఎడిటర్. అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకట్, డాక్టర్ రవివర్మ  యాక్షన్ కొరియోగ్రఫీ అందించనున్నారు.

Macho Star Gopichand new movie Titled Bhimaa:

Macho Star Gopichand Bhimaa, Intense First Look Unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs