Advertisement
Google Ads BL

ఆదిపురుష్ ఈవెంట్లో అదరగొట్టిన కృతి సనన్


తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగిన ఆదిపురుష్ ఈవెంట్ లో హీరోయిన్ జానకి పాత్రధారి కృతి సనన్ చాలా అంటే చాలా స్పెషల్ గా శారీలో అందంగా  కనిపించింది. ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ..

Advertisement
CJ Advs

అందరికీ నమస్కారం.. నమస్కారం అన్నాలా లేదా నేను హాయి డార్లింగ్స్ అని అనాలా.. ఎలా ఉన్నారు? నాకు ఇక్కడ ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరియర్ ని తెలుగులో ప్రారంభించాను. ఇప్పుడు మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇక్కడ ఎంతో ప్రీషియస్ ఫిలిం ఆది పురుష్ వల్ల మీ ముందర ఉన్నాను. ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్.. జానకి దేవి.. చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్స్ కొంతమంది నటులకు మాత్రమే తమ కెరియర్ లో వస్తుంది. మీ ప్రేమ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. థాంక్యూ ఫర్ ఆల్ యువర్ లవ్.. మనం సినిమాలను ఎంచుకోలేము.. సినిమాలే మనల్ని ఎంచుకుంటాయి. ఇలాంటి సినిమాలో నన్ను.. జానకి క్యారెక్టర్ తీసుకోవడం నిజంగా నా అదృష్టం. మీ ప్రేమ మరియు మీ ఆశీర్వాదం వల్లే నాకు ఆఫర్ వచ్చింది. నాకు ఇంకా కూడా మీ ప్రేమ మరియు ఆశీర్వాదం కావాలి. నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను జైశ్రీరామ్, అని అన్నారు. 

ఇక ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారు అని ప్రదీప్ అడగగా దానికి సమాధానముగా కృతి..ప్రభాస్ ఎక్కువ మాట్లాడారు అని విన్నాను.. కానీ అది నిజం కాదు. తాను ఎక్కువగా మాట్లాడుతారు. తను నిజంగా డార్లింగ్ మరియు స్వీట్ హార్ట్. తను చాలా హాడ్ వర్కర్ మరియు చాలా స్వీట్ పర్సన్. అలానే ఫుడ్ ని బాగా ఇష్టపడే మనిషి కూడా. తన కళ్ళల్లో ఉన్న ప్యూరిటీ చూస్తే అసలు ఈ సినిమాలో రాముడు క్యారెక్టర్ తను తప్ప వేరే వాళ్ళు చేయగలరు అని నేను అనుకోవడం లేదు అంటూ తన స్పీచ్ ని ముగించింది.

Kriti Sanon at Adipurush event:

Kriti Sanon special look at at Adipurush event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs