Advertisement
Google Ads BL

ఫస్ట్ టైమ్ ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్


భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. అది మరేదో సినిమాకి కాదు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఒక ఐదు నిమిషాలు ఆది పురుష్ కి. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలి కాలంలో జరగనున్న బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలవబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించి ప్రభాస్ మరియు కృతి సనన్ నటించిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదలకు ముందు, మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో విపరీతమైన శ్రద్ధ వహిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రమోషన్స్ని చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాకి ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరెవరో కాదు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందిన మత గురువు మరియు యోగి సన్యాసి అయిన చిన జీయర్ స్వామి. ఆయన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి  తన దైవిక ఆశీర్వాదాలను కురిపించనున్నారట.

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరగబోతున్న మరికొన్ని విషయాల గురించి చెప్పాలి అంటే..చరిత్రలో తొలిసారిగా... ఈ ఈవెంట్‌లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రాముడు మరియు వేంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి యొక్క అవతారాలు కాబట్టి తిరుపతిలో అయోధ్య యొక్క భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఇక ఆదిపురుష్ మరియు రామాయణం పాటలకి ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. మరో చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఈ ఈవెంట్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ లెవెల్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి 1 లక్ష + మంది భారీ ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నారు.

Adipurush getting bigger and bigger huge arrangements for pre-release event in Tirupati:

Adipurush pre-release event in Tirup
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs