Advertisement
Google Ads BL

ది కానిస్టేబుల్ గా రానున్న వరుణ్ సందేశ్


వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ది కానిస్టేబుల్ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో జరిగాయి. బి. నిఖిత జగదీష్ కెమెరా ఆన్ చేయగా, బి జే రిథిక క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ఈ తరహా చిత్రం తను మునుపెన్నడూ చేయలేదని, ఒక ఎమోషనల్ కానిస్టేబుల్ పాత్రలో ఇందులో నటిస్తున్నానని, దర్శకుడు చెప్పిన కథ, కథనం తననెంతగానో ఆకట్టుకున్నాయనీ, ఈ చిత్రంలో నటిస్తుండటం తనకెంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. 

Advertisement
CJ Advs

దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా, జూన్ 5 వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు, మిగతా నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు నిర్మాత బలగం జగదీష్ తెలిపారు. 

డువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హజరత్ షేక్ (వలి), సంగీతం: సుభాష్ ఆనంద్, మాటలు శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ. నిర్మాత: బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ SK.

Varun Sandesh The Constable Movie Opening:

Varun Sandesh new film debut as The Constable
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs