Advertisement
Google Ads BL

ఇది న్యూ ఏజ్ థ్రిల్లర్ - బెల్లంకొండ గణేష్


స్వాతిముత్యం సినిమాతో అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌మెంట్‌పై నాంది సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో  హీరో బెల్లంకొండ గణేష్  విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Advertisement
CJ Advs

ఈ చిత్రానికి నేను స్టూడెంట్ సర్ టైటిల్ ఎంతవరకు యాప్ట్ గా వుంటుంది ?

నేను ఎప్పుడూ స్టూడెంట్ లానే ఫీలవుతాను. రియల్ లైఫ్ లో జరిగే పరిస్థితులు ఇందులో ఎక్కువగా వుంటాయి. రియల్ ఇన్సిడెంట్స్ ని చాలా యూనిక్ గా చూపించారు. చివరి వరకూ చాలా క్యూరియాసిటీ వుంటుంది. క్లైమాక్స్ వచ్చే వరకూ అసలు విలన్ ఎవరనేది ఊహించలేరు. అది మాత్రం వందశాతం హామీ ఇవ్వగలము.

రాకేష్ గారు ఈ కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి ?

ఈ కథని కృష్ణ చైతన్య గారు రాశారు. రాకేష్ గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు. కృష్ణ చైతన్య గారు కథ చెప్పినపుడు ఇందులో వున్న ఎమోషన్, క్యారెక్టర్ ఆర్క్ కి బాగా కనెక్ట్ అయ్యాను. స్వాతిముత్యం లో నా పాత్ర మొదటి నుంచి చివరి వరకు అమాయకంగానే వుంటుంది. నేను స్టూడెంట్ సర్ లో మాత్రం డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. హ్యాపీ గా మొదలై మధ్యలోకి వచ్చేసరికి బాధ, టెన్షన్ ఉంటూ చివర్లో ఎదురుతిరిగి తనకు వచ్చిన కష్టం నుంచి ఎలా బయటపడ్డాడనే క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా నచ్చింది.

ఈ పాత్ర మీ కెరీర్ కి ఎంత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ?

చాలా ప్లస్ అవుతుంది. చాలా మంది పెద్ద హీరోలు వారి రెండో సినిమాలో స్టూడెంట్ పాత్ర చేశారు. ఇది నాకు మంచి బూస్ట్ అవుతుంది.

దర్శకుడిగా రాకేష్ గారిని తీసుకోవాలనే ఛాయిస్ ఎవరిది ?

రాకేష్ గారు మా అన్నయ్యతో రెండేళ్ళుగా ట్రావెల్ అవుతున్నారు. అలాగే తేజ గారి ప్రొడక్షన్ లో ఆయన ఒక వెబ్ మూవీ చేశారు. అది ఆసక్తికరంగా అనిపించి, డైరెక్షన్ బాగా చేయగలుగుతారనిపించి ఈ సినిమాకి తీసుకోవడం జరిగింది.

భాగ్యశ్రీ గారి అమ్మాయి అవంతిక ని హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ?

భాగ్యశ్రీ గారు అన్నయ్య సినిమాలో నటించారు. అదే సమయంలో వారి అమ్మాయిని తెలుగులో లాంచ్ చేయాలనే ఆలోచన లో ఉన్నారని చెప్పారు. ఈ సినిమాకు ఒక కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించి అవంతికని తీసుకోవడం జరిగింది.

నాంది తో మంచి విజయం అందుకున్న మీ నిర్మాత సతీష్ వర్మ గురించి.?

ఒక హిట్ సినిమా సంస్థ నుంచి వచ్చే సినిమా అంటే సహజంగానే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ కి కూడా ఒక నమ్మకం వుంటుంది. అలాగే ఈ సినిమా కోసం సతీష్ వర్మ గారు చాలా ప్యాషన్ తో పని చేశారు. అందరికంటే ముందు సెట్ కి వచ్చి అందరికంటే చివర్లో వెళ్ళేవారు. సినిమాకి ఏం కావాలో అది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. అత్యున్నత నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

రాకేష్ గారు ఈ కథ చాలా ట్విస్ట్ లతో వెళుతుందని చెప్పారు.. దానికి కారణం ఏమిటి ?  

ముందుగా చెప్పినట్లు .. ఈ కథలోని క్యారెక్టర్ ఆర్క్ అలా డిజైన్ చేశారు. ఒక పరిస్థితి నుంచి బయటపడిన వెంటనే మరో సంఘటన ఎదురౌతుంది. ఒక్కొక్క లేయర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏమౌతుందనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఇది న్యూ ఏజ్ థ్రిల్లర్.

మీ మొదటి సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్స్ లో అందుకు తగ్గ రిజల్ట్ రాలేదు. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు వున్నాయి.?  

స్వాతిముత్యం రిలీజ్ చేసినప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో కలసి రావడం వలన బ్యాడ్ రిలీజ్ డేట్ అనే మాట వినిపించింది. ఉన్నవాట్లో మనదొక్కటే ఫ్యామిలీ సినిమా పండక్కి ఆడే ఛాన్స్ ఉంటుదనే నమ్మకంతో నిర్మాతలు ఆ డేట్ కి విడుదల చేశారు. అది ఇంకా బాగా ఆడాల్సింది.  ఐతే ఓటీటీలో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారు . ఈ విషయంలో నటుడిగా నేను సక్సెస్ అయ్యాననే భావిస్తాను. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ పై మాకు పూర్తి నమ్మకంగా వుంది. మంచి రిలీజ్ డేట్ తో వస్తున్నాను. మంచి సినిమాని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది.

మహతి మ్యూజిక్ గురించి ?

ఈ సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. అలాగే నేపధ్య సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మహతి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి సినిమా చుశామనే అనుభూతితో పాటు మంచి ఆర్ఆర్ విన్నామనే ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటికి వస్తారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్ ?

నెక్స్ట్ ఒక క్రైమ్ కామెడీ చేయబోతున్నా. ఈ రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది.

Bellamkonda Ganesh Interview:

Bellamkonda Ganesh Interview about Nenu Student Sir
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs