Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ జయంతి: VS11 ఫస్ట్ లుక్


విశ్వక్ సేన్ ఓ వైవిధ్యభరితమైన చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో చేతులు కలిపారు. ఇది నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ యొక్క ప్రయాణాన్ని వర్ణించే చిత్రం. సితార సంస్థ యూనివర్సల్ అప్పీల్‌ ఉన్న కథలను ఎంచుకుంటోంది. VS11 మరో మైలురాయి లాంటి చిత్రమవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.

Advertisement
CJ Advs

VS11 చిత్రం చీకటి మరియు క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది. ఈ ప్రపంచానికి నైతికత లేదు, దేనినీ పట్టించుకోదు. అలాంటి ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే.. తన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి అతనికి ప్రేరణ, స్ఫూర్తి అవసరం.

తెలుగు వారి ఆత్మగౌరవం, లెజెండ్ ఆఫ్ లెజెండ్స్ గా పేరుగాంచిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 100వ జయంతి సందర్భంగా, VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, ఆ మహనీయుడిపై తమకున్న ప్రేమను చాటుకుంది చిత్ర బృందం.

ఇప్పటికే విడుదలైన గంగానమ్మ జాతర పోస్టర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఇక ఇప్పుడు నివాళిగా విడుదల చేసిన పోస్టర్ తెలుగువారి హృదయాలను హత్తుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

VS11 - Rags Look:

VS11 - Rags Look - Vishwak Sen and Sithara Entertainments gives tribute to NTR!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs