Advertisement
Google Ads BL

పవర్ ఫుల్ గా టైగర్ నాగేశ్వరరావు


మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు వస్తోంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషన్‌ లు వినూత్న పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మేకర్స్ ఫియర్స్ & మెజెస్టిక్ ఫస్ట్-లుక్ పోస్టర్, ఆసక్తికరమైన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జ్  (గోదావరి) వద్ద గ్రాండ్ గా ఫస్ట్-లుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. గ్రాండ్ ఫస్ట్ లుక్ లాంచ్ కోసం మేకర్స్ రైలును హైర్ చేసుకున్నారు.

Advertisement
CJ Advs

ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ లో రవితేజ ఫెరోషియస్ టైగర్ లా రగ్గడ్ గెటప్‌ లో కనిపించారు. ఇది కేవలం పోస్టర్ అయినప్పటికీ అతని కళ్ళలోకి చూడాలంటే భయంగా ఉంది. రవితేజ బార్స్ వెనుక ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేసేలా కాన్సెప్ట్ పోస్టర్ ఉంది. ఇది ఐదు వేర్వేరు భాషల్లో ఐదుగురు సూపర్ స్టార్‌ ల వాయిస్‌ ఓవర్‌ లతో అద్భుతంగా ప్రజంట్ చేశారు. తెలుగు వెర్షన్‌కి వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, జాన్ అబ్రహం, శివ రాజ్‌కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్ వరుసగా హిందీ, కన్నడ, తమిళం  మలయాళ భాషలలో టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేశారు.

వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా, కథ నిజమైన రూమర్స్ నుండి ప్రేరణ పొందింది. అది 70వ దశకం. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాల్ని చూసి భయపడుతుంది. దడదడ మంటూ వెళ్ళే రైలు ఆ ప్రాంత పొలిమేర రాగానే  గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలు రాయి కనపడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని. ది క్రైమ్‌ క్యాపిటల్‌ అఫ్ సౌత్ ఇండియా.. స్టువర్ట్ పురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా వుంది. టైగర్‌ జోన్‌... ది జోన్ అఫ్ టైగర్ నాగేశ్వరరావు. అంటూ వాయిస్‌ ఓవర్‌ టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేసింది,

జింకల్ని వేటాడే పులుల్ని చూసుంటావ్. పులుల్ని వేటాడి పులిని ఎప్పుడైనా చూశావా ?  అని రవితేజ చెప్పిన డైలాగ్ ఆ పాత్ర స్వభావాన్ని వివరిస్తాయి. సూపర్‌స్టార్ల వాయిస్‌ ఓవర్‌లు ప్రజంటేషన్ ని మరింత ఆసక్తికరంగా మార్చాయి.

Tiger Nageswara Rao Fierce & Majestic First Look Launched:

Ravi Teja Pan India Film Tiger Nageswara Rao Fierce & Majestic First Look Launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs