Advertisement
Google Ads BL

G20 స‌మ్మిట్‌ లో రామ్ చ‌రణ్‌


2023లో భార‌త సినీ ప‌రిశ్ర‌మలో త‌న‌దైన మార్క్‌ను క్రియేట్ చేసి అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకున్న స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి భార‌త‌దేశానికి గ‌ర్వకార‌ణంగా నిలిచారు.  RRRలో అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచిన అంద‌రి మెప్పును పొందిన ఆయ‌న ప్ర‌శంసల‌ను అందుకున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంద‌రికీ మ‌రింత చేరువ‌య్యారు. 

Advertisement
CJ Advs

శ్రీనగర్‌లో జరుగుత‌న్న‌ G20 సమ్మిట్ - టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కు భార‌త సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌పున ఆయ‌న ప్ర‌తినిధిగా హాజ‌ర‌య్యారు. త‌ను పాత్ర ఎంత గొప్ప‌దో ఆయ‌న‌కు తెలుసు. ఆయ‌న త‌న స్వఅనుభ‌వాల‌ను ఆయ‌న వివ‌రించారు. అంతే కాకుండా ప్ర‌పంచంలో సినీ చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన ప్రాంతాల్లో మ‌న దేశం యొక్క సామ‌ర్థ్యం గురించి ఆయ‌న గొప్ప‌గా తెలియ‌జేశారు మ‌న‌ గ్లోబల్ స్టార్. ఈ క్ర‌మంలో భారతదేశంలోని గొప్ప‌ సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా ప్రభావం, అత్యాధునిక సాంకేతికతతో పాటు ఇది చలనచిత్ర నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఎలా మారింద‌నే విష‌యాల‌ను చ‌ర‌ణ్ బ‌లంగా వినిపించారు. ఫిల్మ్ టూరిజం గురించి ఆయ‌న మాట్లాడుతూనే G20లోని స‌భ్య దేశాలు మ‌న దేశంలో చురుకైన భాగ‌స్వామ్యం వ‌హించాల‌ని తెలిపారు. 

ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్‌ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మిక‌త‌ల‌తో మిళిత‌మైన మ‌న గొప్ప‌దనాన్ని సినీ రంగం త‌ర‌పున తెలియ‌జేసే అవ‌కాశం రావ‌టం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి కంటెంట్‌ను ఎంతో విలువైన జీవిత పాఠాలుగా అందించే గొప్ప‌ద‌నం మ‌న ఇండియ‌న్ సినిమాల్లో ఉన్నాయి అన్నారు. 

ఈశాన్య ప్రాంతాల‌కు సంస్కృతి, అభివృద్ధి మ‌రియు టూరిజం మినిష్టర్ అయిన జి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘రామ్ చరణ్‌గారు అద్భుతంగా త‌ను చెప్పాల‌నుకున్న విష‌యాల‌ను వివ‌రించారు. ఆయ‌న త‌న విన‌యంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఈ G20 స‌మ్మిట్‌కు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ త‌ర‌పున చ‌ర‌ణ్‌గారు ప్ర‌తినిధిగా రావ‌టం గ‌ర్వంగా ఉంది. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ-పర్యాటక రంగం పట్ల అతని అంకితభావం మన దేశ సహజ సౌందర్యాన్ని సంరక్షించడానికి, గొప్ప‌గా ప్రదర్శించడానికి యువతను ప్రోత్సహించట‌మే కాకుండా వారికి శక్తివంతమైన ప్రేరణగా నిలుస్తుంది అన్నారు.

Global Star Ram Charan at G20 Summit:

Global Star Ram Charan, Chosen as Representative of Indian Film Industry at G20 Summit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs