Advertisement

రాజ్ మృతికి చిరు-పవన్ సంతాపం


మెగాస్టార్ చిరు 

Advertisement

ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో రాజ్ ఇక లేరు అని తెలవటం  దిగ్భ్రాంతికి  గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా  కెరీర్  తొలి దశలలో నా  చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన  బాణీలు, నా చిత్రాల  విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను  ప్రేక్షకులకు  మరింత  చేరువ  చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి  తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి !  🙏🙏    

#RestInPeace #MusicDirectorRaj

సంగీత దర్శకులు శ్రీ రాజ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

సినీ సంగీత దర్శకులు శ్రీ రాజ్ గారు  కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలనాటి సంగీత దర్శకులు శ్రీ టి.వి.రాజు గారి వారసుడుగా తనదైన బాణీని చూపారు. తన మిత్రుడు శ్రీ కోటి గారితో కలసి రాజ్ - కోటి ద్వయంగా చక్కటి సంగీతం అందించారు. అన్నయ్య చిరంజీవి గారు నటించిన యముడికి మొగుడు, ఖైదీ నెం.786, త్రినేత్రుడు లాంటి చిత్రాలకు ప్రాచుర్యం పొందిన గీతాలు అందించడంలో శ్రీ రాజ్ గారి భాగస్వామ్యం ఉంది. శ్రీ రాజ్ గారు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

Chiru-Pawan mourns music director Raj death:

Music Director Raj Dies Chiranjeevi and Pawan Kalyan Offers Condolences
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement