Advertisement
Google Ads BL

సుధీర్ కొత్త టైటిల్ అవసరమా వీడికి..


బుల్లితెర నుండి వెండితెరకి దూసుకుపోయిన కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఒకప్పుడు బుల్లితెరని ఏలాడు.. ఇప్పుడు వెండితెరకి ఏలడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన కాలింగ్ సహస్ర విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆయన తదుపరి SS4 ఈమధ్యనే మొదలయ్యింది.

Advertisement
CJ Advs

సుధీర్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా పాగల్ ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మరియు బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం G.O.A.T Tagline :GreatestOfAllTimes సుడిగాలి సుధీర్ బర్త్ డే  సందర్బంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను గ్రాండ్ గా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్బంగా 

చిత్ర నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ...మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రోజు సుడిగాలి సుధీర్ బర్త్ డే రోజున మా "GOAT" సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాండ్ రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమాకు తగ్గట్టే లియో మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు. మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.. 

దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ... ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు  ధన్యవాదాలు. ఈ సినిమా షూటింగ్ విషయంలో మాకు ఏది కావాలన్నా బడ్జెట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.హీరో, హీరోయిన్ లు ఇద్దరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు.లియో మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు.మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

SS4 Titled As G.O.A.T - Greatest Of all those times :

Sudigali Sudheer  SS4 Titled As G.O.A.T- Greatest Of all those times 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs