Advertisement
Google Ads BL

హిట్ అయితే కస్టడీ2 ఉంటుంది : నాగ చైతన్య


యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ కస్టడీ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా ని నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక  ప్రాజెక్ట్‌ ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో  నాగ చైతన్య ఇంటర్వ్యూ విశేషాలు.  

Advertisement
CJ Advs

కస్టడీ అనేది సీరియస్‌ యాక్షన్‌ సినిమా కదా? మీకున్న ప్రజెంట్‌ మూడ్‌ ను షూటింగ్‌ లో ఎలా మ్యాచ్‌ చేసుకున్నారు. మీకనిపించిన ఛాలెంజ్‌ ఏమిటి?

ప్రతి సినిమాకు రెండు నెలలు వర్క్‌ షాప్‌ చేస్తాను. క్యారక్టర్‌ ఎలావుండాలి అనేవి కథలోని కొన్ని సీన్స్‌ ను 5డి కెమెరాతో షూట్‌ చేస్తాం. ఈ కథ పరంగా కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లను పరిశీలించాను. కొంతమంది ని కలిశాను కూడా. ఇలాంటివి కొంతమంది దర్శకులు ఎంకరేజ్‌ చేస్తారు. అలా వెంకట్‌ ప్రభు నాకు ప్రీడమ్‌ ఇచ్చారు. పోలీసు కానిస్టేబుళ్లను కలిశాక. వారి కష్టాలు విన్నాక నాకే ఇన్స్పయిరింగ్ గా అనిపించింది. అందుకే వారి కథలు చెప్పాలనుకున్నా.

యాక్షన్‌ సినిమాలలో పోలీస్‌ పాత్రల్లో మీకు ఎవరు ఫేవరేట్‌?

ఘర్షణ ఆల్‌ టైం. ఇక ఇంటర్నేషనల్‌ పరంగా జేమ్స్‌ బాండ్‌ 007 సినిమాలు అంటే ఇష్టం.

మానాడు సినిమా తర్వాత ఈ సినిమా అనుకున్నారా?

వెంకట్‌ ప్రభుగారి మానాడు సినిమాకు ముందే కస్టడీ కథ ఓకే అయింది. ఈ కథ నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది, అందుకే చేశాను.

వెంకట్‌ప్రభు గారి దర్శకత్వంలో సినిమా చేశాక ప్రేక్షకులు  ఎలా రెస్పాండ్‌ అవుతారని అపిపిస్తుంది?

నేను సినిమా చూశా. చాలా నమ్మకంతో వున్నా. ఆడియన్స్‌ ఎలా స్వీకరిస్తారో వారి తీర్పే ఫైనల్‌. నేను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌ గా వుంటుంది. ఇలాంటి రోల్‌ నాకు కస్టడీలో వర్కవుట్‌ అయింది అనుకుంటా. ఈ సినిమా తర్వాత పూర్తి భిన్నమైన సినిమా చేయబోతున్నా.

యాక్షన్‌ పార్ట్‌ చేసేటప్పుడు ఎటువంటి కేర్‌ తీసుకున్నారు?

యాక్షన్‌ సీన్స్‌ చాలా నాచురల్‌ గా వుంటాయి. ఫైట్‌ మాస్టర్లతో రిహార్సల్స్‌ చేశాక షూట్‌ కు వెళ్ళాం. పైకి ఎగిరే సన్నివేశాలు, అండర్‌ వాటర్‌ వంటి సీన్స్‌ వారితో చర్చించాక చేసినవే. కస్టడీ ట్రైలర్‌, టీజర్‌ లో అది మీకు కనిపిస్తుంది. మనం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రేక్షకులు ఇట్టే పట్టేస్తారు. అందుకే యాక్షన్‌ పార్ట్‌ చాలా కీలకం ఈ సినిమాలో.

మీరు ఏ పాత్ర చేస్తున్నారు?

నేను కానిస్టేబుల్‌గా నటించా. నా పాత్రపరంగా వెంకట్‌ప్రభుగారు చెప్పింది చెప్పినట్లు తీశారు. పూర్తి న్యాయం చేశాను. ఎంజాయ్‌ చేస్తూ చేసిన పాత్ర ఇది.

తెలుగు దర్శకులతో నటించారు. తమిళ దర్శకుడిలో మీరు గమనించిన వ్యత్యాసం ఏమిటి?

ఒక్కో దర్శకుడిది  ఒక్కో శైలి. వెంకట్‌ప్రభుగారి స్క్రీన్‌ప్లే చాలా వెరైటీగా వుంటుంది. మానాడు అనే సినిమాలో చాలా కన్‌ఫ్యూజ్‌ పాయింట్‌ ను తేలిగ్గా చూపించేశారు. మెచ్చూర్డ్‌ డైరెక్టర్‌.

సినిమా పూర్తయ్యాక దర్శకుడు చెప్పింది వచ్చిందనుకున్నారా?

నాకు కథ ఏమి చెప్పారో అది తీశారు. మొన్ననే ఆర్‌.ఆర్‌. అన్నీ అయ్యాక థియేటర్‌ లో సినిమా చూశాను. మంచి సినిమా ఇవ్వబోతున్నామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఏ రేంజ్‌లో వుంటుందనేది ప్రేక్షకుల తీర్పును బట్టివుంటుంది.

చేసిన సినిమాలలో తప్పొప్పులు గురించి ఆలోచిస్తారా?

నటుడిగా నాకు నేనే తప్పులు వెతుకుతుంటాను. అదే నా ఇంప్రూవ్‌ మెంట్‌ కూడా.

అరవింద్‌ స్వామి గారి నుంచి ఏం నేర్చుకున్నారు?

అరవింద్‌గారికి స్క్రిప్ట్‌ పేపర్‌ ఏది ఇస్తారో దాన్ని ఓన్‌ గా తన శైలితో ఇంప్రూవ్‌ మెంట్‌ చేసుకుంటారు. పేకప్‌ అయ్యాక కూడా ఆ పాత్ర గురించే ఆలోచిస్తారు. నైట్‌ మెసేజ్‌ కూడా ఫలానా సీన్‌ గురించి ఇలా వుండాలంటూ చెబుతారు.  

కస్టడీలో పోలీసుగా ఫ్యాన్స్‌ ఏవిధంగా రిసీవ్‌ చేసుకుంటారు?

నేను పర్టిక్యులర్‌ గా పలానా పాత్ర అనేది చేయను కథను బట్టి పాత్రను బేరీజు వేసుకుంటాను. లవ్‌ స్టోరీలు గతంలో చేశాను. కంటిన్యూ  గా  అవే చేస్తే నటుడిగా ఎదగలేను. చైతన్య ఎలాంటి కథలోని పాత్రనైనా బాగా చేస్తాడని అనిపించుకోవాలి.

పోలీస్‌ పాత్ర యాంగ్రీగా వుంటుంది. అండర్‌ డాగ్‌ ప్లే చేయడానికి ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?

కానిస్టేబేల్‌ పాత్ర ఫస్టాఫ్‌ లో ఎంజాయ్‌ చేసేవిధంగా వుంటుంది. సెకండాఫ్‌లో వచ్చే సరికి కానిస్టేబుల్‌ గ్రోత్‌ మారుతూ వుంటుంది. ఇది అందరికీ కనెక్ట్‌ అవుతుంది కూడా.

నటి పరంగా కృతి శెట్టి లో మీరు గమనించింది ఏమిటి?

ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగా పండించింది. నటిగా తను చాలా మెచ్యూర్డ్‌. తమిళం బాగా నేర్చుకుంది.

మీరు తమిళ్‌ డబ్బింగ్‌ చెప్పారా?

నటుడిగా వాయిస్‌ ముఖ్యం. అందుకే తమిళంలో నేను డబ్బింగ్‌ చెప్పాను. మొదట్లో చిన్న చిన్న లోపాలున్నా బాగానే చెప్పగలిగాను.

కస్టడీ లాంటి అండర్‌ డాగ్  సినిమాలు గతంలో వచ్చాయి. అందులో మీకు ఆల్‌ టైం ఫేవరేట్‌ మూవీస్‌ ఏవి?

చాలా సినిమాలు వున్నాయి.

నిర్మాతగారు మాట్లాడుతూ, నాగార్జునగారికి శివ ఎలాగో చైతన్యకు  కస్టడీ  అలాగ అన్నారు. మీరేమంటారు?

నవ్వుతూ.. ఏ సినిమాకూ కస్టడీని కంపేర్‌ చేయవద్దు. నేను ఈ సినిమాపై  చాలా కాన్‌ఫిడెంట్‌ గా వున్నాను.

అక్కినేని ఫ్యాన్స్‌ గొప్పగా ఫీలయేట్లు వుంటుందా?

నూరు శాతం వారికి పాజిటివ్‌గా వుంటుంది. అక్కినేని అభిమానులకు మంచి సినిమా ఇచ్చాననే నమ్మకం నాకుంది.

శరత్‌కుమార్‌, ప్రియమణి, అరవింద్‌ స్వామి ముగ్గురు ఉద్దండుల మధ్య నటించడం మీకెలా అనిపించింది?

ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో ముగ్గురి మధ్య నలిగిపోతాను. అదే సినిమాకు హైలైట్‌. అందుకే లుక్‌ పరంగా డిఫరెంట్‌ గా కనిపిస్తాను. సైజ్‌ కూడా తగ్గాను. ఫిట్‌ కానిస్టేబుల్‌ ఎలా వుంటాడో అలా మార్చుకున్నా.

అక్కినేని కుటుంబ హీరోగా మీకు ఒత్తిడి ఏమైనా వుందా?

నేను చేసే ప్రతి సినిమా ఛాలెంజ్ గా  తీసుకుంటాను. ప్రతిరోజూ కష్టపడి పని చేస్తుంటాను. తాతగారు, నాన్నగారికి ఫ్యాన్స్‌ ఎలా అయ్యారంటే వారికంటూ ఒక శైలితో ఆకట్టుకున్నారు. అలాగే నేను, అఖిల్‌ కూడా స్వంత స్టయిల్‌ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం.

నిర్మాత శ్రీనివాస్‌ గారు భారీ బడ్జెట్‌ అయిందన్నారు?

శ్రీనివాస్‌గారు చాలా ఓపెన్‌ గా వుంటారు. కథ విన్నారు. కనెక్ట్‌ అయ్యారు. ఫ్యాషనేట్‌ నిర్మాతగా ఈ సినిమా చేశారు.

నాగచైతన్య కెరీర్‌లో భారీ బడ్జెట్‌ అన్నారు. దానిపై మీ స్పందన?

ఆయన చాలా ఖర్చు పెట్టారు. నేను ఏ సినిమాలో చేయని యాక్షన్‌ సీన్స్‌ ఇందులో చేశాను. అందుకే ప్రొడక్షన్‌ పరంగా హయ్యస్ట్‌ సినిమా అవుతుంది.

ఇళయరాజాగారిని ఎంచుకోవడానికి కారణం?

ఈ సినిమా 1990 బ్యాక్‌ డ్రాప్‌ లో జరుగుతుంది. అందుకే ఆ కాలానికి తగిన విధంగా ఇళయరాజా గారి వింటేజ్‌ వుంటుంది. అందుకే అడిగారు. ఈ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అల్టిమేట్‌. ఇళయరాజాగారు కొన్ని ట్రాక్స్‌ నోట్‌ ఇచ్చారు. దానిని యువన్‌ శంకరరాజా అద్భుతం గా చేశారు.

అండర్‌ వాటర్‌ సీన్‌ ఎన్నిరోజులు చేశారు?

నాలుగు రోజులు రిహార్సల్స్‌ చేశాం. మొత్తం 15రోజుల్లో షూట్‌ చేశాం.

ఈ రోజుల్లో ప్రేక్షకుల ఆలోచనలు మారాయి? హీరోగా మీకేమనిపిస్తుంది?

కరెక్టే. ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. వారం వారం హీరో ఫేట్‌ మారిపోతుంది. కొత్త కథలను వారు అంగీకరిస్తున్నారు. హీరోగా ప్రతి వారికి ఛాలెంజ్‌గా వుంటుంది. సక్సెస్‌ కు ఒక ఫార్ములా లేదు.

సినిమా చేస్తున్నప్పుడే సక్సెస్‌ ఫెయిల్యూర్‌  తెలిసిపోతుందా?

రెండే చోట్ల తెలిసిపోతుంది. కథను ఎంపికలోనూ, షూటింగ్‌ లోనూ తెలిసిపోతుంది. వాటిని సరి చేసుకుంటూ సినిమా చేయడమే ముందున్న కర్తవ్యం.

కూల్‌ గా వుండే మీరు ఫెరోషియస్‌ పాత్ర ఎలా చేయగలిగారు?

అది వృత్తిపరంగా చేస్తాం. కూల్‌ అనేది వ్యక్తిగతం. ఏ నటుడికైనా వర్క్‌షాప్‌ చాలా ఉపయోగపడుతుంది. అది నాకు ఉపయోగపడింది.  దానివల్ల బడ్జెట్‌పరంగా నిర్మాత కొంత సేవింగ్‌ కనిపిస్తుంది.

కస్టడీ2 వుంటుందా?

ప్రేక్షకులు హిట్‌ చేస్తే తప్పకుండా చేస్తాం.

అందరూ పాన్‌ ఇండియావైపు వెళుతున్నారు?

తెలుగు, తమిళ ఆడియన్స్‌ నా టార్గెట్‌.

Custody 2 if Hit : Naga Chaitanya:

Naga Chaitanya Interview 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs