Advertisement
Google Ads BL

VD12 నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్


విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న VD12 చిత్రం మే 3న సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

Advertisement
CJ Advs

నేడు(మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ చాలా క్రియేటివ్ గా ఉంది. పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కలపై కథానాయకుడి రూపం కనిపించడం ఆకట్టుకుంటోంది. కథానాయకుడి కళ్ళలో ఇంటెన్స్ కనిపిస్తోంది. అలాగే పోస్టర్ పై I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy అని రాసుంది. పోస్టర్ ను రూపొందించిన తీరు చూస్తుంటే సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతోంది.

గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ జెర్సీ చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. జెర్సీ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రతిభకు, అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విజయ దేవరకొండ తోడయ్యారు. అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన నాయికగా శ్రీలీల నటిస్తున్నారు. తన అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యువ తార మొదటిసారి విజయ్ తో జోడీ కడుతుండటం విశేషం. 

An intense birthday poster of Vijay Deverakonda VD12 unveiled:

 An intense birthday poster of Vijay Deverakonda VD12 unveiled; wows fans and netizens
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs