బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ చిత్రం #BoyapatiRAPO శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, మాస్ ఎక్కువగా ఉండబోతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమైయ్యాయి.
ఈ మేరకు డబ్బింగ్ స్టూడియో నుంచి దర్శకుడు బోయపాటి ఫోటోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ కు జోడిగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కొంతమంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు.