Advertisement
Google Ads BL

ప్రైమ్‌ లో బెన్‌ ఎఫ్లెక్‌ నటించిన AIR


మే 12 నుంచి ఇండియాలో ప్రైమ్‌ వీడియోలో AIR ఇంగ్లిష్‌, హిందీ, తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళంలో ప్రదర్శించబడుతుంది. బెన్‌ ఎఫ్లెక్‌ నటించిన AIR చిత్ర డిజిటల్‌ ప్రీమియర్‌ అందించబోతున్నట్టు భారతదేశం మెచ్చిన అత్యంత వినోద కేంద్రం ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. అమెజాన్ స్టూడియోస్‌, స్కైడ్యాన్స్‌ స్పోర్ట్స్‌, మాండలే పిక్చర్స్‌ నిర్మించాయి. ఇది ఎఫ్లెక్‌, మ్యాట్‌ డామన్‌కు చెందిన ఆర్టిస్ట్స్‌ ఈక్విటీ చేపట్టిన తొలి ప్రాజెక్టు కూడా. మే 12 నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో స్ట్రీమ్‌ కానుంది. ఏటా ₹1499తో ప్రైమ్‌ సభ్యులు పొదుపు, సౌకర్యం, వినోదం అన్ని ఒకే చోట పొందవచ్చు. భారతదేశంలో ప్రైమ్‌ సభ్యులు AIRను ఇంగ్లిష్‌, హిందీ, తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళంలోనూ చూడవచ్చు.

Advertisement
CJ Advs

ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన AIR ప్రస్తుతం టమోటో మీటర్‌ నుంచి 92% సర్టిఫైడ్‌ ఫ్రెష్‌ రేటింగ్‌ అందుకుంది. అలాగే రొటెన్‌ టమాటోస్‌ నుంచి 98% వెరిఫైడ్‌ ఆడియన్స్‌ స్కోర్‌, సినిమాస్కోర్‌ నుంచి A పొందింది.

అవార్డులు గెలుచుకున్న డైరెక్టర్‌ బెన్ ఎఫ్లెక్‌ దర్శకత్వం వహించిన AIR చిత్ర కథ ఎయిర్‌ జోర్డన్‌ బ్రాండ్‌తో ప్రపంచ క్రీడలను, సమకాలీన సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నైకీకి చెందిన అప్పటి బాస్కెట్‌ బాల్‌ డివిజన్‌కు చెందిన మైకేల్‌ జోర్డన్‌కు చెందిన నమ్మశక్యం కాని ఆటను మలుపు తిప్పిన భాగస్వామ్యాన్ని వెల్లడిస్తుంది. అన్నింటినీ పాటిస్తూ సంప్రదాయన్ని ధిక్కరించేలా సాగే ఆట అందర్ని కదిలిస్తుంది. తన కుమారుడిలో ఉన్న అద్భుత నైపుణ్యం గురించి ఏ మాత్రం రాజీపడని తల్లి, చరిత్రలో నిలిచిపోయిన దిగ్గజ బాస్కెట్‌ బాల్‌ ఆటగాడి కథ ఇది.

ఈ చిత్రంలో నైకీ ఎగ్జిక్యూటివ్‌ సోనీ వాకారో పాత్రలో మ్యాట్‌ డ్యామన్‌ నటించారు. నైకీ సహ వ్యవస్థాపకుడు ఫిల్‌ నైట్‌ పాత్రను ఎఫ్లెక్‌ పోషించారు. రాబ్‌ స్ట్రాసర్‌గా జాసన్‌ బేట్‌మన్‌, డేవిడ్‌ ఫాక్‌గా క్రిస్‌ మెసినా, పీటర్‌ మూరేగా మ్యాథ్యూ మహేర్‌, జార్జ్‌ రావెలింగ్‌, హోవర్డ్‌ వైట్‌గా క్రిస్‌ టక్కర్‌, డెలోరిస్‌ జోర్డన్‌గా వయోలా డేవిస్‌, హార్స్ట్‌ డ్యాస్లర్‌గా గుస్తావ్‌ స్కార్స్‌గార్డ్‌ ఇందులో నటించారు.

మ్యాట్‌ డ్యామన్‌ నటింతచిన చిత్రాన్ని బెన్‌ ఎఫ్లెక్‌ దర్శకత్వం వహించడం ఇదే మొదటిసారి. అలెక్స్‌ కన్వరీ స్క్రిప్ట్‌ రాసిన AIR చిత్రాన్ని డేవిడ్‌ ఎలిసన్‌, జెస్సీ సిస్‌గోల్డ్, జాన్‌ వెయిన్‌బాచ్‌, ఎఫ్లెక్‌, డ్యామన్‌, మ్యాడిసన్‌ ఐన్లీ, జెఫ్‌ రాబినోవ్‌, పీటర్‌ గూబర్‌, జాసన్‌ మైకేల్‌ బెర్మన్‌ నిర్మించారు. డాన్‌ గోల్డ్‌బెర్గ్‌, డాన్‌ గ్రాంగ్రర్‌, కెవిన్‌ హాలోర్యాన్‌, మైకేల్‌ జో, డ్రూ వింటన్‌, జాన్‌ గ్రాహమ్‌, పీటర్‌ ఈ.స్ట్రాస్‌, జోర్డన్‌ మోల్డో ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు.

ఈ చిత్రంలో 80లకు చెందిన మర్చిపోలేని సౌండ్‌ ట్రాక్‌ – బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్‌, సిండీ లాపార్‌, REO స్పీడ్‌వ్యాగన్‌, ది క్లాష్‌, నైట్‌ రేంజర్‌, డైర్‌ స్ట్రెయిట్స్‌, గ్రాండ్‌మాస్టర్‌ ఫ్లాష్‌ & ది ఫ్యూరియస్‌ ఫైవ్‌, స్క్వీజ్‌ సహ ఎన్నో సోనీ మ్యూజిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటలాగ్‌ డివిజన్‌కు చెందిన లీగసీ రికార్డింగ్స్‌ నుంచి డిజిటల్‌ రూపంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

AIR Release May 12th:

AIR Movie on Prime Video in India from May 12th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs