Advertisement
Google Ads BL

నవ్వించడం కష్టం, ఏడిపించడం సులువు: అల్లరి


నాంది తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ఉగ్రం తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌ గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌  కు  ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఉగ్రం చిత్ర యూనిట్ Q &A ప్రెస్ మీట్ నిర్వహించింది.  

Advertisement
CJ Advs

మిమల్ని అల్లరి నరేష్ గా చూశారు.. ఉగ్రంతో ఉగ్రం నరేష్ అనే పిలిచే స్థాయి ఈ సినిమాతో వస్తుందా ?

నరేష్ : నన్ను ఎలా పిలుస్తారో తెలీదు కానీ ఈ ఉగ్రం మాత్రం ఒక  ప్రత్యేకమైన సినిమాగా అలరిస్తుంది. నాంది చేసినపుడు ఎంత గర్వంగా అనిపించిందో ఉగ్రం కూడా అలానే అనిపించింది.  

కామెడీ నటులు సీరియస్ పాత్రలు చేసినపుడు ప్రేక్షకుల ఆదరణ కొంచెం తక్కువ వుంటుంది కదా?

నరేష్:  కామెడీని మనం చిన్న చూపు చూస్తాం. కానీ కామెడీ చేసిన వాళ్ళు ఏదైనా చేస్తారు. నవరసాల్లో కష్టమైనది హాస్యం. నవ్వించడం కష్టం .. ఏడిపించడం సులువు.

ఈ పాత్ర చేయడం ఎలా అనిపించింది ?

నరేష్ : దర్శకుడు విజయ్ టాస్క్ మాస్టర్. ముందే నా బలాలు, బలహీనతలు చెప్పారు. పాత నరేష్ ఎక్కడ కనిపించకూడదని చెప్పారు. విజయ్ ఏం చెప్పారో అది చేశాను. తను యాక్ట్ చేసి మరీ చూపించారు.

నరేష్ గారిని ఈ పాత్రలో ఎంచుకోవడానికి కారణం ?

విజయ్: ఈ కథ అనుకునప్పుడే నరేష్ గారిని ఊహించుకున్నాను. యాక్షన్ తో పాటు ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కూడా వుంటుంది. అవన్నీ బ్యాలెన్స్ చేసే హీరో నరేష్ గారు అనిపించింది.

పరిశ్రమలో చిన్న పెద్ద మీడియం నిర్మాతలు వుంటారు కానీ మీరు అన్నిట్లో వుంటున్నారు ?

సాహు: ఓసారి అడుగుపెట్టాక అన్నీ చేయాలి. అందరి హీరోలతో కలసి పని చేయాలని వుంటుంది.

అబ్బూరి రవి గారు.. ఇందులో కొన్ని డైలాగ్స్ సెన్సార్ కట్స్ పడ్డాయి కదా .. అలాంటి మాట ఎందుకు రాయాల్సింది వచ్చింది ?

అబ్బూరి రవి:  గత ఇరవై ఏళ్ళుగా నేను ఎంతో భాద్యతతో మాటలు రాస్తున్నాను. అలాంటి మాట ఒకటి రాయాలని అనుకున్నపుడు ఎంతో అలోచించి వుంటాను. కేవలం అక్కడ వున్న పాత్ర, దాని ఎమోషన్ ని చెప్పడానికి మాత్రమే ఆ మాట రాయాల్సివచ్చింది కానీ .. ఒక చెడు మాట రాయలనే ఉద్దేశం కాదు.

ఒక్కసారిగా సీరియస్ పాత్రలు వైపు రావడానికి కారణం ?

నరేష్ : నటుడిగా పేరుతెచ్చుకోవాలని నాకూ వుంటుంది. అలాగే కొత్తదనం కూడా ప్రయత్నించాలి. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలు కొత్తదారి లో వెళ్ళాడని నమ్మకాన్ని ఇచ్చాయి. ఆ క్రమంలోనే నాంది వచ్చింది. ఇప్పుడు ఉగ్రం వస్తోంది.

ఉగ్రంలో యాక్షన్ ఎలివేషన్స్ కొత్తగా కనిపిస్తున్నాయి ?

నరేష్: గతంలో కూడా ఫైట్లు చేశాను. అయితే అవి నవ్వించడానికి. ఇందులో మాత్రం ఎమోషన్ వేరు. ఇందులో యాక్షన్స్ సీన్స్ అన్నీ నేచురల్ గా వుంటాయి. ముందుగా రిహార్సల్ చేయడం యాక్షన్ కి చాలా కలిసొచ్చింది.

కథపై ఎలాంటి పరిశోధన చేశారు ?

తూమ్ వెంకట్: మిస్సింగ్స్ దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. వాటిపై ఆర్టికల్స్ సేకరించి పక్కా ఆధారాలతోనే చేశాం.

సీరియస్ పోలీస్ అధికారిగా  చేయడం ఎలా అనిపించింది ?

నరేష్ : పోలీస్ గెటప్ లో చేసిన బ్లేడ్ బాబ్జీ , కితకితలు మంచి విజయాలు సాధించాయి. అయితే అవి కామెడీ రోల్స్. ఉగ్రం లో సీరియస్ రోల్ . చాలా నిజాయితీగా చేసిన సినిమా. ఇందులో  తొలిసారి ఉగ్రం రూపంలో కనిపిస్తున్నా.

హీరోయిన్ పాత్ర ఎలా వుంటుంది ?

విజయ్: ఇందులో హీరోయిన్ పాత్ర కూడా కీలకం. నరేష్ గారితో పాటు ప్రయాణించే పాత్ర. ప్రేమ కథ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ వుంటాయి.

ఉగ్రం సక్సెస్ రేట్ ఎంత వుంటుంది ?

నరేష్: మొన్న సినిమా చూశాను. నా హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుంది

విజయ్ : నాందికి మూడింతలు వుంటుంది.

ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు సాహు, హరీష్, ఎడిటర్ చోటాకే ప్రసాద్, సిద్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, తూమ్ వెంకట్, బేబీ ఊహ మిగతా చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Ugram Q and A:

Allari Naresh Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs