Advertisement
Google Ads BL

ఆదిపురుష్ సీతగా కృతి సనన్


భారత ఇతిహాసాల్లోనే అత్యంత గౌరవించదగిన మహిళా సాథ్వి సీత. ప్రస్తుతం ఆదిపురుష్ తో ప్రభాస్, కృతి సనన్ జంటగా రామాయణ గాథను తెరకెక్కించాడు ఓం రౌత్. సీతా నవమి సందర్బంగా..  అంకితభావం, నిస్వార్థత, శౌర్యం మరియు స్వచ్ఛతకు ప్రతిరూపం జానకి. కృతి సనన్ నటించిన జానకి  మంత్రముగ్ధమైన రూపం తో ఉన్న  మోషన్ పోస్టర్‌ తో పాటు.. రామ్‌ సియా రామ్‌ ఆడియో టీజర్‌ ను కూడా విడుదల చేశారు.

Advertisement
CJ Advs

జానకి పాత్రలో కృతి సనన్ స్వచ్ఛత, దైవత్వం మరియు ధైర్యాన్ని రాఘవ్ భార్యగా సూచిస్తుంది. రాం సియా రామ్ ట్యూన్ జానకికి రాఘవ పట్ల ఉన్న అచంచలమైన భక్తిని తెలియజేసేలా ఉంది. ఈ పాట  ప్రేక్షకులను ఆధ్యాత్మికత, భక్తి ప్రపంచానికి తీసుకువెళుతుంది.

ఈ గీతాన్ని  సచేత్-పరంపర స్వరపరిచారు.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌ను టి-సిరీస్ భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రోఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ తో పాటు యు వి క్రియేషన్స్ ప్రమోద్, వంశి నిర్మించారు.16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Team Adipurush celebrates Maa Sita Navmi :

Adipurush: Janaki starring Kriti Sanon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs