Advertisement
Google Ads BL

అఖిల్ గ్రేట్ పర్శన్: సాక్షి వైద్య


యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ఏజెంట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ సాక్షి వైద్య విలేకరుల సమావేశంలో ఏజెంట్ విశేషాల్ని పంచుకున్నారు.

Advertisement
CJ Advs

ఏజెంట్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?

కోవిడ్ సమయంలో కాలేజ్ కూడా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. నాకు ఖాళీ ఉండకుండా ఎదో ఒకటి చేయడం అలవాటు. ఆ సమయంలో సోషల్ మీడియా రీల్స్ చేశాను. అందులో కొన్ని వైరల్ అయ్యాయి. నా ఫ్రెండ్స్ ఆడిషన్స్ కి వెళ్ళమని సలహా ఇచ్చారు. ముంబైలో కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఆ సమయంలో ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ కాల్ చేసి సినిమా గురించి చెప్పారు. మొదట నమ్మలేదు. తర్వాత ముంబైలో ముఖేష్ అనే కాస్ట్యూమ్ డైరెక్టర్.. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద డైరెక్టర్, బిగ్ కోస్టార్, చాలా మంచి అవకాశం అని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. సురేందర్ రెడ్డి గారికి నచ్చింది. అలా ఏజెంట్ ప్రాజెక్ట్ లోకి వచ్చాను.

మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ?

మాది ముంబైలోని థానే. స్కూల్, కాలేజ్ అక్కడే జరిగింది. నేను  ఫిజియోథెరపిస్ట్ ని. ఇప్పుడు నటిగా మారాను.(నవ్వుతూ).

ఏజెంట్ లో మీ పాత్ర ఎలా వుంటుంది ?

ఏజెంట్ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. అయితే సినిమా, జీవితం ప్రేమ లేకుండా పూర్తవ్వదు. ఇందులో ఏజెంట్ కి ప్రేయసిగా కనిపిస్తా. ఏజెంట్ మొత్తం సీక్వెన్స్ మాతోనే మొదలౌతుంది.

అఖిల్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

అఖిల్ గ్రేట్ పర్శన్. చాలా హంబుల్. చక్కగా మాట్లాడతారు. తన నుంచి చాలా నేర్చుకున్నాను.

ఇది మీ మొదటి సినిమా.. ఇప్పటికే చాలా ప్రశంసలు వచ్చాయి.. ఎలా అనిపిస్తుంది ?

చాలా ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులు మనసు చాలా గొప్పది. చాలా అభిమానిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. తెలుగు నేర్చుకుంటున్నాను.

ఏజెంట్ లో మీ పాత్రకు  ఎలాంటి ప్రాధన్యత వుంటుంది ?

ఏజెంట్ లో నాది కీలకమైన పాత్ర. నటించడానికి ఆస్కారం వుండే పాత్ర. నా మొదటి సినిమాకే ఇంత పెద్ద సినిమా దొరకడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారు.

ఏజెంట్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?

ఏజెంట్ మాసీవ్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఏజెంట్ యాక్షన్.. థ్రిల్.. ప్రేక్షకులకు అడ్రినలిన్ రష్ ఇస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. 

అఖిల్ తో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది ?

చాలా ఎంజాయ్ చేశాను. నేను భరతనాట్యం నేపధ్యం నుంచి రావడం వలన స్టెప్స్ ని త్వరగా నేర్చుకోగలిగాను.

ఇది మీ మొదటి సినిమా కదా.. ఏజెంట్ నుంచి ఏం నేర్చుకున్నారు ?

మామూలుగా ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు చాలా తేలిగ్గా ఒక మాట అనేస్తాం. కానీ నటిస్తున్నపుడు, యూనిట్ లో భాగమైనపుడు అసలు కష్టం తెలుస్తుంది. ఏజెంట్ లో ఆ కష్టం తెలిసింది. పేరు తెచ్చుకోవాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే.

ఏజెంట్ లో మీ సహానటులు గురించి చెప్పిండి ?

ఇందులో అను గారు, మురళి శర్మ గారితో నాకు సీన్స్ వున్నాయి. ఇలాంటి వెటరన్ నటులతో పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. వారి సూచనలు కూడా చాలా సహకరించాయి.

ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ లో పని చేయడం ఎలా అనిపించిది ?

ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ చాలా హెల్ప్ ఫుల్ ప్రొడ్యూసర్స్. చాలా మంచి టీం. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి బిగ్ బ్యానర్ లో మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శక, నిర్మాతల నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

వరుణ్ తేజ్ గారితో ఓ సినిమా చేస్తున్నా.

Sakshi Vaidya Interview:

Sakshi Vaidya Interview about Agent
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs