Advertisement

శ్రీసింహ ఉస్తాద్ టీజ‌ర్..


శ్రీసింహా కోడూరి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తోన్న చిత్రం ఉస్తాద్. ఈ సినిమా టీజర్‌ను రానా ద‌గ్గుబాటి రిలీజ్ చేశారు. 

Advertisement

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ.. శ్రీసింహ సహా ఈ టీమ్‌లో దాదాపు అంద‌రితో నాకు అనుబంధం ఉంది. రాకేష్ నాతో నెంబ‌ర్ వ‌న్ యారి చేశాడు. హిమాంక్ నా టాలెంట్ ఏజెన్సీ న‌డిపాడు. ఇక సింహ అయితే బాహుబ‌లి సమ‌యంలో ఐదేళ్ల పాటు నాతో ట్రావెల్ చేశాడు. టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.అంద‌రూ మంచి సినిమా చేసుంటార‌ని అనుకుంటున్నాను. నాకు బైక్ న‌డ‌ప‌టం రాదు. అయితే ఎవ‌రైతే బాగా వెహిక‌ల్ న‌డుపుతుంటారో వారిని బాగా ఇష్ట‌ప‌డుతుంటాను. డైరెక్ట‌ర్ ఫ‌ణిదీప్‌ను రీసెంట్‌గానే క‌లిశాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ లాంటిదే ఓ మోట‌ర్ బైక్‌కి పెట్టాశాడంటే అత‌ని గ‌ట్స్ వేరే లెవ‌ల్ అని అర్థ‌మ‌వుతుంది. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌నలు అన్నారు. 

హీరో శ్రీసింహ మాట్లాడుతూ.. మా ఉస్తాద్ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసిన రానాగారికి థాంక్స్‌. కాస్త నెర్వ‌స్‌గా ఉంది. ఈ సినిమా క‌థ విన్నాను. అప్పుడు అందులో హీరోకి బైక్ బాగా న‌డ‌ప‌టం రావాలి. నాకేమో అంతంత మాత్ర‌మే వ‌చ్చు. అందుక‌ని ముందే చెబితే హీరోని ఎక్క‌డ మార్చేస్తారో అని చెప్ప‌కుండా రేపు షూటింగ్ ఉంద‌న‌గా చెప్పాను. త‌న‌కు గుండెల్లో రాయి ప‌డ్డ‌ట్ల‌య్యింది. ఈ సినిమాలో హీరోకి బైక్ ఎలాగైతే ఉస్తాద్ అయ్యిందో నాకు కూడా అలాగే అయ్యింది. ఎందుకంటే షూటింగ్ స‌మ‌యంలో బైక్ రైడింగ్ బాగా నేర్చుకున్నాను. చాలా మంచి జ్జాప‌కాలున్నాయి. టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంద‌ని భావిస్తున్నాను. అంద‌రికీ థాంక్స్‌ అన్నారు. 

నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు సపోర్ట్ చేయటానికి వచ్చినందుకు రానా గారికి థాంక్స్. ఇదొక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనాలి. డైరెక్ట‌ర్ ఫణిదీప్ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుని సినిమా చేయాల‌ని చాలానే ప్ర‌య‌త్నించాడు. అంత‌లా ఏముందా ఆ స్క్రిప్ట్‌లో అని విన్నాను. వెంట‌నే సినిమా చేయాల‌నుకున్నాను. కానీ నాకంత సీన్ లేదు. ఆ స‌మ‌యంలో హిమాంక్ మాతో క‌లిశాడు. త‌ను ఒకే చెప్ప‌కుండా ఉండుంటే ఇది ముందుకెళ్లేది కాదేమో. టీజ‌ర్‌లో మీరు చూసింది చాలా చిన్న‌ది. సినిమా చాలా పెద్ద రేంజ్‌లో ఉంటుంది. సాయికొర్ర‌పాటిగారికి థాంక్స్‌. ఆయ‌నిచ్చిన భ‌రోసాతోనే ఈరోజు ఇలా నిల‌బ‌డ్డాం. సింహ త‌ర్వాత మా క‌థ‌పై న‌మ్మ‌కంతో సినిమా చేయ‌టానికి రెడీ అయ్యారు. మా ఆర్టిస్టుల‌కు, టెక్నిషియ‌న్స్‌కి థాంక్స్‌ అన్నారు. 

హిమాంక్ రెడ్డి దువ్వూరు మాట్లాడుతూ.. నెంబర్ వన్ యారి సమయంలో నేను, రాకేష్ కలిశాం. అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి స్టోరి ఉంద‌ని రాకేష్ చెప్ప‌గానే విన్నాను. ఫ‌ణిదీప్ నెరేష‌న్ విన‌గానే క‌నెక్ట్ అయ్యాను. సింహ, కావ్య‌ల‌కు థాంక్స్‌. మంచి సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాం అన్నారు. 

డైరెక్ట‌ర్ ఫ‌ణిదీప్ మాట్లాడుతూ.. సినిమా ఏంట‌నేది సింపుల్‌గా టీజ‌ర్‌లో చెప్పాం. ఇప్పుడు మా టీమ్ గురించి మాట్లాడుకోవాలి. నాతో స‌హా చాలా మంది ఈ సినిమాతో జ‌ర్నీని స్టార్ట్ చేశాం. రెండేళ్ల ముందే ఈ టైటిల్‌ను రిజిస్ట‌ర్ చేయించాం. సినిమా గురించి ఇంకా విశేషాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం అన్నారు. 

వెంక‌టేష్ మ‌హ మాట్లాడుతూ.. ఈ సినిమాలో సింహ చిన్న‌నాటి పాత్ర‌కు తండ్రి పాత్ర‌లో న‌టించాం. నేను, ఫ‌ణిదీప్ ఒకేసారి జ‌ర్నీని స్టార్ట్ చేశాం. మా లైఫ్‌లో ఉన్న బైక్ క‌థే అని చెప్పాలి. మంచి అనుబంధం ఉంది. ఉస్తాద్ బైక్‌తో మా అంద‌రికీ రిలేషన్ ఉంది. ఏదైనా వ‌స్తువుతో మ‌న‌కు రిలేష‌న్ ఉంటే దానికి లైఫ్ ఉంటుంద‌నే చెప్పాలి. అలాంటిదే మా ఉస్తాద్ బైక్‌. అలాగే నిజ జీవితంలోనూ మంచి సినిమా ఎక్క‌డున్నా రానాగారు ఉస్తాద్ బైక్‌లా మారి ముందుకు తీసుకెళ‌తున్నారు. నా ఫ‌స్ట్ మూవీకి ఆయ‌న‌తో ఎటాచ్‌మెంట్ వ‌చ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఫ‌ణి ఫ‌స్ట్ ఫిల్మ్‌కి కూడా రానాగారు రావ‌టం అనేది గొప్ప విష‌యం. నిర్మాత‌లు స‌హా అంద‌రికీ థాంక్స్‌ అన్నారు. 

కావ్యా కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఉస్తాద్ టీజ‌ర్ న‌చ్చే ఉంటుంద‌ని అనుకుంటున్నాం. క‌చ్చితంగా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు. 

ఇంకా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొని త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. 

న‌టీన‌టులు: శ్రీసింహా కోడూరి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అనుహాస‌న్‌, ర‌వీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ తదిత‌రులు

సాంకేతిక వ‌ర్గం, బ్యాన‌ర్స్‌: వారాహి చ‌ల‌న‌చిత్రం, సాయి కొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్‌, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, నిర్మాత‌లు: ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఫ‌ణిదీప్‌, సినిమాటోగ్ర‌ఫీ: ప‌వ‌న్ కుమార్ పప్పుల, మ్యూజిక్‌: అకీవా.బి, ఎడిట‌ర్‌: కార్తీక్ క‌ట్స్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అర‌వింద్ ములె, సౌండ్ డిజైన్‌: అశ్విన్ రాజ‌శేఖ‌ర్‌, కాస్ట్యూమ్స్‌: ప్రియాంక వీర‌బోయిన‌, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌: సునీల్ రాజు చింత‌, లిరిక్స్‌: అనంత శ్రీరాం, రెహ‌మాన్‌, ల‌క్ష్మీ ప్రియాంక‌, లైన్ ప్రొడ్యూస‌ర్స్‌: ప్ర‌జ‌న‌య్ కొనిగ‌రి, రాజేష్ గ‌డ్డం, పి.ఆర్‌.ఒ: వంశీ కాకా.

Ustaad movie Trailer Launch:

Trailer Launch of Ustaad movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement