Advertisement
Google Ads BL

సామ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది: మృణాల్


సీతారామంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సమంతతో కలిసి నటించాలని ఉందంటూ లేటెస్ట్ గా ట్విట్టర్ లో ఆస్క్ సామ్ అనే హ్యాష్ ట్యాగ్ లో తన అభిప్రాయం తెలిపింది. సమంతను ఉద్దేశిస్తూ మృణాల్ ..‘శాకుంతలం సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆతృతగా ఉన్నారు. సామ్.. మీరు చాలామందిని ఇన్స్ స్పైర్ చేస్తున్నారు. మనిద్దరం కలిసి సినిమా ఎప్పుడు చేద్దాం.. ’అంటూ ప్రశ్నించింది. దీనికి సమంత కూడా వెంటనే రియాక్ట్ కావడం విశేషం. ఈ ఐడియా నాకు నచ్చింది. #Gumraah beautiful @mrunal0801కి అభినందనలు చెబుదాం. మీరూ ఈ ఐడియాని ప్రేమించండి!! అంటూ రిప్లై ఇచ్చింది సమంత. 

Advertisement
CJ Advs

మృణాల్ ప్రశ్నకు సమంత సమాధానం చెప్పడం నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక నెటిజన్ .. వావ్ మీ ఇద్దరూ కలిసి నటిస్తే.. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

అయితే సమంతకు కూడా మృణాల్ తో నటించడం ఇష్టమే అన్నట్టుగా ఉంది. అందుకే వెంటనే రియాక్ట్ అయింది అంటున్నారు. ఈ బ్యూటీఫుల్ లేడీస్ మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు ఇంటర్నెట్ లో తుఫాన్ లా మారింది. అలాగే వీరి సంభాషణకు వచ్చిన సమాధానాలతో ఈ టాలెంటెడ్ లేడీస్ ఇద్దరూ త్వరలో ఒక సినిమా కోసం కలిసి వచ్చే అవకాశం ఉందని స్పష్టమైంది.

సమంత శాకుంతలం ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఇక మృణాల్ ఠాకూర్ సీతారామం తర్వాత మళ్లీ అలాంటి ఎఫెక్టివ్ స్టోరీ కోసం కాస్త గ్యాప్ తీసుకుంది. ఫైనల్ గా నాని సరసన ఓ మూవీ చేస్తోంది. శౌర్యువ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.

వర్క్ ఫ్రంట్‌లో, సీతా రామం వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన తదుపరి తెలుగు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు, దాని కోసం ఆమె నానితో జతకట్టింది. శౌర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.

Sitaramam beauty expressed her wish to work with Samantha :

Sitaramam beauty Mrunal Thakur expressed her wish to work with Samantha 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs