Advertisement
Google Ads BL

అశోక్ గల్లా బర్త్ డే స్పెషల్ గ్లిమ్ప్స్


హీరో చిత్రంతో సినీ అరంగేట్రం చేసి అందరినీ అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్- అశోక్ గల్లా2  చేస్తున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

Advertisement
CJ Advs

అశోక్ గల్లాకు పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్.. అశోక్ ని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజంట్ చేసే గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ వీడియోలో రగ్గడ్ గా, చివర్లో తన మీసాలను మెలితిప్పినట్లు కనిపించారు అశోక్ గల్లా. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాస్ డైరెక్టర్‌ బోయపాటికి శిష్యుడు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో బోయపాటి మార్క్ మనం చూడవచ్చు.

టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన పాపులర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రఫర్ ప్రసాద్ మూరెళ్ల కెమరామెన్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు  త్వరలో తెలియజేస్తారు.

AshokGalla2 Glimpse Out:

Ashok Galla Production No1, AshokGalla2 Glimpse Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs