Advertisement

తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు NTR


నాన్న గారి శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని, తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు ఎన్. టి. ఆర్, ఆయన ప్రభావం ప్రాభవం ఇప్పటికీ తెలుగు జాతికి స్ఫూర్తినిస్తుందనటానికి ఇదే నిదర్శనమని నందమూరి బాలకృష్ణ అన్నారు.

Advertisement

ఎన్. టి. ఆర్ శత జయంతి వేడుకల కమిటీ, చైర్మన్ టి.డి. జనార్థన్ సారధ్యంలో నందమూరి బాలకృష్ణతో ఆదివారం రోజు బేటీ అయ్యింది. ఈ సందర్భంగా కమిటీ చేస్తున్న కృషిని జనార్దన్ బాలకృష్ణకు వివరించారు. తన తండ్రే తనకు స్ఫూర్తి ప్రదాతని, ఆయన మార్గంలోనే తాను ప్రయాణిస్తున్నానని బాలకృష్ణ చెప్పారు.

ఎన్. టి. ఆర్. శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తిండిపోయేలా తమ కమిటీ గత ఆరు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడని ఆయన చెప్పారు. జయహో ఎన్. టి. ఆర్. పేరుతో ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో రామారావు గారికి సంబంధించిన వ్యాసాలు / వీడియోలు ఉంటాయని, అలాగే రామారావు గారు ముఖ్యమంత్రి గా అసెంబ్లీ లో చేసిన ప్రసంగాలు, బయట చేసిన ప్రసంగాలను రెండు పుస్తకాలుగా తీసుకిస్తున్నామని, శకపురుషుడు పేరుతో ఒక ప్రత్యేక సంచిక రూపకల్పన చేస్తున్నామని, ఇందులో రామారావు గారి సినిమా, రాజకీయ జీవితంపై పై విశ్లేషణాత్మక మైన వ్యాసాలు, అపురూపం, అరుదైన ఫోటోలు వుంటాయని జనార్దన్ తెలిపారు. 

తమ తండ్రి గారు సినిమా రంగంలో సాధించిన విజయాలు, చేసిన వినూత్న ప్రయోగాలు, ముఖ్యమంత్రిగా ప్రజల అభ్యున్నతికి ఆయన చేపట్టిన పథకాలు ఈనాడు దేశమంతా అమలవుతున్నాయని, అంటే ఆయన దూర ద్రుష్టి ఎలాంటిదో ఇప్పటి తరాలకు తెలుస్తుందని, వారిని ఎప్పటికీ నిలిపేలా మీరు చేస్తున్న అసామాన్యమైన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మేము కూడా ఈ కృషిలో భాగస్వాములమవుతామని బాలకృష్ణ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

చైర్మన్ టి. డి. జనార్దన్, మిగతా కమిటీ సభ్యుల ను బాలకృష్ణ అభినందించారు. 

ఎన్. టి. ఆర్ శత జయంతి వేడుకలను విజయవాడ, హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జనార్దన్ తెలిపారు. 

చైర్మన్ టి.డి. జనార్థన్ సభ్యులు, కాట్రగడ్డ ప్రసాద్, భగీరథ, విక్రమ్ పూల, అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు, మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్ మరియు విజయ్ భాస్కర్, గౌతమ్ బాలకృష్ణను కలసి తమ కృషిని తెలిపారు.

Balakrishna congratulated T.D. Janardhan and committee members:

Arrangements are being made to hold NTR centenary celebrations in Vijayawada and Hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement