Advertisement
Google Ads BL

హిందీ ఛత్రపతి ఫస్ట్ లుక్


బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ప్రభాస్, రాజమౌళి ల బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి రీమేక్‌ తో తెలుగు హీరో శ్రీనివాస్ బెల్లంకొండను బాలీవుడ్‌ లో లాంచ్ చేస్తోంది.  బ్లాక్‌బస్టర్ చిత్రాల డైరెక్టర్ వివి వినాయక్, శ్రీనివాస్ బాలీవుడ్ లాంచ్‌ ప్యాడ్‌ కి దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈరోజు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసిన మేకర్స్, రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ఛత్రపతి అని పేరు పెట్టారు. సమ్మర్ స్పెషల్ గా మే 12న సినిమా థియేటర్లలోకి రానుంది.  

ఫస్ట్-లుక్ పోస్టర్‌ శ్రీనివాస్ ని షర్ట్ లేకుండా బీస్ట్ మోడ్ లో ప్రజంట్ చేసింది. కండలు తిరిగిన దేహంతో కనిపించారు శ్రీనివాస్. ఒక చేతిలో రాగి చెంబుతో నీటిలో నిలబడి, వీపుపై గాయాలతో కనిపించారు. మెడ, చేతిపై పవిత్రమైన దారాలను ధరించారు. పోస్టర్, భీకరమైన మేఘాలు శ్రీనివాస్ పాత్ర యొక్క అగ్రెసివ్ ని సూచిస్తున్నాయి ఈ సినిమాలో పవర్‌ ప్యాక్‌తో కూడిన పాత్రను పోషించేందుకు బెల్లంకొండ అద్భుతమైన ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. వివి వినాయక్ , శ్రీనివాస్ ని యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో ప్రెజెంట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే డిజిటల్ వరల్డ్ వైడ్  బిగ్గెస్ట్  స్టార్‌లలో ఒకరు. శ్రీనివాస్ ఖూంఖార్ (జయ జానకి నాయక హిందీ డబ్బింగ్) రికార్డ్ 700 మిలియన్ల వ్యూస్ ని అధిగమించింది.

ఒరిజినల్‌కి కథను అందించిన రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్‌ రీమేక్ వెర్షన్‌కి కూడా రచయిత. పలు తెలుగు తమిళ చిత్రాలకు పనిచేసిన నిజార్ అలీ షఫీ కెమెరా మెన్ గా, బాలీవుడ్ అప్ కమింగ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు.

Hindi Chatrapathi First Look:

Sreenivas Bellamkonda, VV Vinayak Chatrapathi First Look Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs