Advertisement
Google Ads BL

ఎన్.టి.ఆర్. శతజయంతి కమిటీకి అభినందనలు


ఎన్.టి.ఆర్. శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు, నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ సారధ్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, నారా చంద్రబాబునాయుడు గారితో వారి నివాసంలో బేటీ అయ్యింది.

Advertisement
CJ Advs

మహానటుడు, ప్రజానాయకుడు తెలుగువారి ఆరాధ్యుడు అయిన ఎన్.టి.ఆర్. శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తిండిపోయేలా జయహో ఎన్.టి.ఆర్. అన్న వెబ్ సైట్, శకపురుషుడు అనే ప్రత్యేక సంచికతో పాటు ఎన్.టి.ఆర్. శాసనసభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో రెండు పుస్తకాలను తీసుకొస్తున్నామని జనార్ధన్ చంద్రబాబు నాయుడుగారికి వివరించారు.

ఈ శతజయంతి వేడుకలలో భాగంగా ఎన్.టి.ఆర్. ప్రసంగాలతో వెలువడే రెండు పుస్తకాలను విజయవాడలో ఆవిష్కరిస్తామని, వెబ్ సైట్ మరియు శకపురుషుడు సంచికను హైదరాబాదులో ఏర్పాటు చేసే కార్యక్రమంలో విడుల చేస్తామని చెబుతూ ఈ రెండింటికీ సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబు నాయుడుగారికి వివరించారు. 

గత ఐదు నెలలుగా ఎన్.టి.ఆర్. శతజయంతి కమిటీ శ్రమిస్తుందని సినిమా రంగంలోని ప్రముఖులు మరియు రాజకీయరంగంలోని నిష్ణాతుల అభిప్రాయాలను వీడియో/వ్యాస రూపంలో తీసుకోవటం జరిగిందని ఎన్.టి.ఆర్.ను తరతరాలు గుర్తుంచుకునే దిశగా వీటిని రూపకల్పన చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారికి జనార్థన్ వివరించారు. 

ఎన్.టి. రామారావు గారు నటుడుగా, రాజకీయ నాయకుడుగా అనూహ్య విజయాలను సాధించి మార్గదర్శకుడిగా మిగిలాడని అలాంటి నాయకుడిపై జనార్థన్ సారధ్యంలో కమిటీ చేస్తున్న కృష్టిని చంద్రబాబు నాయుడుగారు అభినందించారు.

ఈ కమిటీ చేస్తున్న అవిరళ కృషికి తమ మద్దత్తు ఉంటుంది హైదరాబాద్, విజయవాడ రెండు ప్రాంతాలలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు విజయవంతం కావటానికి అన్ని రకాలైన మద్ధతు ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు.

టి.డి. జనార్థన్ అధ్యక్షతన రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్, కె. రవిశంకర్, విక్రమ్ పూల, భగీరథ, అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు, మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్, మధుసూదన రాజు, విజయ్ భాస్కర్, గౌతమ్ బొప్పన కమిటీ సభ్యులు చంద్రబాబునాయుడు గారిని  ఆయన నివాసంలో కలిసి తమ కృషిని వివరించారు.

The NTR Centenary Celebrations Committee s efforts are appreciated by Chandrababu Naidu.:

Chandrababu Naidu appreciates the efforts of the NTR Centenary Celebrations Committee
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs