Advertisement
Google Ads BL

NTR30 ఓపెనింగ్ కి ఆయన వస్తున్నారా?


ఎన్టీఆర్-కొరటాల కాంబోలో పాన్ ఇండియా స్థాయిలో మొదలు కాబోతున్న NTR30 ఓపెనింగ్ కి రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయనే న్యూస్ ఎన్టీఆర్ ఫాన్స్ ని నిలవనియ్యడం లేదు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ పాట అందుకుంటున్నారు. ఏడాది కాలంగా NTR30 అదిగో మొదలవుతుంది, ఇదిగో మొదలవుతుంది అనడమే కానీ.. ఇంతవరకు అది జరగపోయేసరికి ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యి ఉన్నారు. అందుకే ఓపెనింగ్ డేట్ దగ్గర పడేకొద్దీ వారిలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ఎన్టీఆర్ తో నటించబోయే జాన్వీ కపూర్ NTR30 ఓపెనింగ్ లో సందడి చేసే అవకాశం స్పష్టంగా ఉండగా.. విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని కొరటాల ఎంపిక చేశారనే న్యూస్ నడుస్తుంది. కాని అధికారికంగా సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ విలన్ అని ప్రకటించలేదు. అయితే ఇప్పుడు NTR30 ఓపెనింగ్ కి సైఫ్ అలీ ఖాన్ వస్తాడా.. రాడా అనే సందేహంలో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. 

ఒకవేళ సైఫ్ కూడా ఈ ఓపెనింగ్ లో ఎన్టీఆర్ పక్కన కనిపిస్తే అది హిందీకి త్వరగా రీచ్ అవుతుంది. ఆటోమాటిక్ గా నేషనల్ మీడియాలో హైలెట్ అవుతుంది, అలాగే బాలీవుడ్ వెబ్ సైట్స్ లో జాన్వీ కపూర్ హీరోయిన్, విలన్ సైఫ్, NTR30  ఓపెనింగ్ అంటూ ప్రముఖంగా ప్రచురిస్తారు. ఆలా జరగాలనేది ఎన్టీఆర్ ఫాన్స్ ప్లాన్. మరి NTR30  ఓపెనింగ్ కి రామ్ చరణ్, రాజమౌళి వస్తారని అన్నప్పటికీ.. ప్రస్తుతం వారు అమెరికా నుండి ఇంకా రాలేదు. ఇక మెగాస్టార్ చిరు ముఖ్య అతిధిగా NTR30 ఓపెనింగ్ కార్యక్రమం జరగబోతుంది అంటున్నారు. 

ఫైనల్ గా ఎవరెవరు NTR30 ఓపెనింగ్ హాజరవుతారో తెలియాల్సి ఉంది. రేపు 18 న సినిమాని పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టి మార్చ్ 29 నుండి కానీ.. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి కానీ రెగ్యులర్ షూట్ కి వెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉండగా.. 2024 ఏప్రిల్ 5 న NTR30  రిలీజ్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు.

Saif Ali Khan attends NTR30 opening?:

Saif Ali Khan is confirmed as the antagonist in NTR 30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs