Advertisement
Google Ads BL

వైష్ణవ తేజ్ విలన్ గా మలయాళ యాక్టర్


పంజా వైష్ణవ్ తేజ్  కెరీర్ లో నాలుగో సినిమాగా రూపొందుతోన్న PVT4 చిత్రం ద్వారా శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తొలి చిత్రంతోనే ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో సరికొత్త మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. భారీస్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ప్రతినాయకుడి పాత్రను పరిచయం చేస్తూ తాజాగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

Advertisement
CJ Advs

ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ చిత్రంలో చెంగా రెడ్డి అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఇరాట్ట, జోసెఫ్, నయత్తు, తురముఖం, మధురం వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన పలు పురస్కారాలను సైతం అందుకున్నారు. ఇప్పుడు ఈయన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. 

ఆయన పోషిస్తున్న చెంగా రెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టుకొని, మరో చేత్తో లైటర్ తో నోట్లోని సిగరెట్ ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికిస్తూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఉన్న  జోజు జార్జ్ పాత్ర తాలూకు పోస్టర్ పవర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంది. 

Malayalam actor enters PVT04:

Malayalam actor Joju George to play the antagonist in PVT04
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs