Advertisement
Google Ads BL

ఎర్రగుడి నిర్మాణం 70 శాతం పూర్తి


అన్విక ఆర్ట్స్ వారి ఎర్రగుడి సినిమా మూడో షెడ్యూల్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఆ వివరాలను దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి తెలియజేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10వ తేదీ వరకు జరిగిన మూడో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కార్యక్రమాలు 70% పూర్తయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ మండువా హౌస్, బూత్ బంగ్లా, కేరళ హౌస్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాము. ఆదిత్య ఓం, వెంకట్ కిరణ్, శ్రీజిత ఘోష్, సమ్మెట గాంధీ, ఎస్తేర్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జ్యోతి, శ్రావణి, గూడ రామకృష్ణ, మధు నంబియార్, ఆర్కే, గంగాధర్, రవిరెడ్డి, దేవి శ్రీ ప్రభు తదితరులపై కథలోని కీలక ఘట్టాలను చిత్రీకరించాము. మార్చి 10 వరకు జరిగిన షెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ లో జరిగే నాలుగో షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేస్తాము అన్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి.

Advertisement
CJ Advs

నిర్మాణ నిర్వాహకుడు ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. షూటింగ్ అనుకున్న ప్రకారం చక్కగా జరుగుతుంది. ఎర్రగుడి సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. అమ్మవారికి సంబంధించిన అంశాలు హైలైట్ అవుతాయి. గ్రాఫిక్స్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ ఆర్.డి.ఎస్ మాట్లాడుతూ.. ఇది 1975 నుంచి, 1995 మధ్య కాలంలో.. గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. అప్పటి పీరియడ్ని తెరమీద చూపించడానికి చాలా ఖర్చు పెడుతున్నాం. మా ఎర్రగుడి సినిమాకి అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ అనే క్యాప్షన్ పెట్టాం. అదే కథాంశాన్ని తెలియజేస్తుంది. ప్రేమ, ఫ్యాక్షన్, స్పిరిట్యువల్ అంశాలతో మా ఎర్రగుడి సినిమా రూపొందుతోంది. ఏప్రిల్ లో ఆఖరి షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది అన్నారు.

అన్నపూర్ణ స్టూడియో మండువా హౌస్ లో షూటింగ్ జరుగుతుండగా శ్రీమతి అక్కినేని అమల లొకేషన్ కి విచ్చేసి, కొద్దిసేపు గడిపి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

నటీనటులు: వెంకట్ కిరణ్, శ్రీజిత ఘోష్, ఆదిత్య ఓం, సత్య ప్రకాష్, ఢిల్లీ రాజేశ్వరి, వనితా రెడ్డి, జ్యోతి, శ్రావణి, శ్రీ కళ, ఆర్కే, సమ్మెట గాంధీ, గూడ రామకృష్ణ, మధు నంబియార్, గంగాధర్, రవి రెడ్డి, దేవిశ్రీ ప్రభు, చీరాల రాజేష్, రామ్ రమేష్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 సాంకేతిక నిపుణులు: సంగీతం: మాధవ్ సైబ, సుధాకర్ మారియో, రామ సుధీ, సంజీవ్, సినిమాటోగ్రఫీ:ఎస్ ఎన్ హరీష్, ఆర్ట్: కెవి రమణ, ఫైట్స్: నటరాజ్, కొరియోగ్రఫీ: సన్ రేస్ మాస్టర్, ఎడిటింగ్: శేఖర్ పసుపులేటి, కో డైరెక్టర్: అక్షయ్ సిరిమల్ల, లైన్ ప్రొడ్యూసర్: ఆర్.డి.ఎస్, నిర్వహణ: ఘంటా శ్రీనివాసరావు, నిర్మాత: ఎం.ఎస్.కె, రచన, దర్శకత్వం: సంజీవ్ కుమార్ మేగోటి. 

Erragudi Shooting is 70% complete:

Erragudi Movie Shooting is 70 percent complete
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs