Advertisement
Google Ads BL

గేమ్ ఆన్‌ నుండి ఫస్ట్ లిరికల్


గీత్ ఆనంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం గేమ్ ఆన్‌. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి రిచో రిచ్ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ.. గతంలో మేము విడుదల చేసిన గేమ్ ఆన్ టైటిల్ అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ లాంచ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా హైదరాబాద్ ఫేమస్ నవాబ్ గ్యాంగ్ బ్యాండ్ ద్వారా మ్యూజిక్ ను ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నాము. ప్రోమో కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్ గా టీజర్  రిలీజ్ చేసినప్పుడు, టీజర్ ను చూసిన చాలా మంది  ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని ఈ సినిమా గురించి మరింత ఆసక్తిగా అడగడం జరిగింది. దీంతో ఈ సినిమాపై మాకు చాలా మంచి నమ్మకం వచ్చింది. ఇక తెలుగు అడియన్స్ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తారనే విషయం మనకు తెలిసిన విషయమే. పరభాషా సినిమాలకు కూడా మనవాళ్ళు చాలా మంచి హిట్స్ ఇచ్చారు. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్ చేస్తున్నారు. ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్ గా ఈ సినిమా చెయ్యడం విశేషం. వారిద్దరూ కలసి నాకు చెప్పిన కంటెంట్ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. అందరూ ఎంతో కష్టపడి, కలసి టీం వర్క్ చేశారు. అర‌వింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువ‌ల్స్ ఇచ్చాడు. ప్ర‌తి ఫ్రేమ్ మిమ్మ‌ల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. 

ఇన్‌టెన్స్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ఇది. హీరో ఒక లూజ‌ర్  గా తన లైఫ్ లో మిగిలిపోతున్న టైమ్‌లో త‌న లైఫ్‌లో ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. త‌న‌ని ఆ గేమ్ ఏ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌నేదే ఈ క‌థ‌. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ త‌ప్ప‌కుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ప్రతీ ఒక్కరూ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. ఈ రోజు  మేము విడుదల చేసిన సాంగ్ కు కూడా ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా చేయబోతున్నాము. అలాగే ఈ సినిమాకు మేము చేసే ప్రతి ప్రమోషన్ కూడా వినూత్నమైన రీతిలో ఉంటుంది. అలాగే మా సినిమాను కూడా మీరందరూ ఆదరించాలని  కోరుకుంటూ ఈ రిచో రిచ్ సాంగ్ ను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు.

డైరెక్ట‌ర్ ద‌యానంద్ మాట్లాడుతూ.. ఇది రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు రావడమే కాదు.. స‌క్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవ‌లోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నాను. చాలా ట్విస్టులు, ట‌ర్నులుంటాయి. మేము చెప్పిన కథను నమ్మి సినిమా చెయ్యడానికి వచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. తను ఆస్ట్రేలియా లో ఉన్నా కూడా ఎంతో యాక్టీవ్ గా ప్రతి విషయంలో అప్డేట్ లో ఉంటాడు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ముఖ్యంగా మా బ్రదర్ పై నమ్మకం పెట్టి ఈ కథ  రాసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమాకు హీరోగా, దర్శకుడుగా మేము ఇద్దరు అన్నదమ్ములం పోటీగా వర్క్ చేస్తున్నాము. ఈ సినిమాలో యాక్ష‌న్‌, రొమాన్స్. ఎమోష‌న్స్... అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటాయి” అని అన్నారు.

First lyric from Game On Movie:

 Launch of the first lyric Richo Rich song from the Game On movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs