Advertisement
Google Ads BL

ఛాంపియన్ గా శ్రీకాంత్ కొడుకు రోషన్


ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ తమ ప్రొడక్షన్ నంబర్ 9 గా యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి అశ్వనీదత్ భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

Advertisement
CJ Advs

రోషన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ సినిమాలో అతని లుక్‌ను రివీల్ చేయడంతో పాటు టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ఛాంపియన్‌ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. రోషన్ పోస్టర్‌లో పొడవాటి జుట్టు, లైట్ గడ్డంతో చాలా అందంగా కనిపిస్తున్నాడు. టైటిల్ లోగోపై రెండు వైపులా రెక్కలతో ఫుట్‌బాల్ ఉంది.

పెళ్లి సందడి సినిమాతో అందరినీ మెప్పించిన రోహన్ ఛాంపియన్‌లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా సినిమా కోసం రోషన్ కోవర్ అయ్యారని పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రదీప్ అద్వైతం రోషన్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి విన్నింగ్ స్క్రిప్ట్‌ను రాశారు. ఈ చిత్రంలో  ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

Roshann New Movie Titled Champion:

Vyjayanthi Movies, Swapna Cinemas Production No 9 With Roshann, Pradeep Advaitham Titled Champion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs